BREAKING
ప్రభుత్వ జూనియర్ కళాశాల కౌటాలలో ఘనంగా స్వాగత వేడుకలు ఎస్ అండ్ పీ 500 సూచీపై యూబీఎస్ అంచనా అభివృద్ధి చెందిన దేశాల్లో రికార్డు స్థాయి ద్రవ్య లోటు ప్రముఖ గాయిని భూదేవి తల్లికి దక్కిన గొప్ప గౌరవం : ఊటుకూరు లక్ష్మమ్మకు విశిష్ట మాతృమూర్తి పురస్కారం చింతకుంటలో సబ్ కలెక్టర్ హర్ష చౌదరి  పర్యటన - ఆగిపోయిన "విఓ" భవనానికి మోక్షం కళ్యాణదుర్గం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో వాహనాలు వేలం, కర్ణాటక మద్యం నాటుసార ధ్వంసం. సంపూర్ణ విజ్ఞానానికి గ్రంధాలయాలు దోహదం : ప్రధాన శాఖ గ్రంధాలయ అధికారిణి ఆర్.వసంతకుమారి : గ్రంధాలయ వారోత్సవాల్లో భాగంగా వ్యాసరచన పోటీలు రబీలో పంటల వైవిధ్యీకరణకు ప్రాధాన్యత.. తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త  మధు డిసెంబరు 22న ఎస్.ఐ.ఆర్ తుది జాబితా ప్రకటన: జేసీ అశుతోష్ శ్రీవాస్తవ లగ్జరీ గూడ్స్ మార్కెట్‌లో కోలుకుంటున్న వృద్ధి కొత్తగూడలో బోరుబావికి మరమ్మతులు అమెరికా కంపెనీలకు ట్రంప్ సర్కార్ హెచ్చరిక గుడుంబాపై ఎక్సైజ్ అధికారుల దాడులు.. 14 లీటర్ల గుడుంబా స్వాధీనం మెటా 'మ్యూజ్' ఏఐ ఏజెంట్‌పై భద్రతా నీలి నీడలు ప్రతీ పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరా: జేసి అశుతోష్ శ్రీవాస్తవ

అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ అందించాలి - కలెక్టర్ రాజర్షి షా

Select Suryaa Now
అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ అందించాలి - కలెక్టర్ రాజర్షి షా
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి : ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పథకాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. అర్హత కలిగిన ఏ ఒక్క కుటుంబం కూడా పథకం ప్రయోజనానికి దూరం కాకుండా సమగ్ర కార్యాచరణతో నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుపై సమీక్షించారు.ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, కుటుంబంలో సంపాదించే వ్యక్తి ఆకస్మికంగా మరణించినప్పుడు ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించడమే పథకం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రతి కుటుంబంలో 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగిన సంపాదించే ఒక వ్యక్తిని బీమా పరిధిలోకి తీసుకోవాలని, కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది సంపాదించే వారు ఉంటే ఎవరిని ఎంపిక చేసుకోవాలనేది కుటుంబ సభ్యులే నిర్ణయించుకునే అవకాశం కల్పించాలని సూచించారు. కుల, మత, ఆదాయ భేదాలు లేకుండా అర్హులందరికీ పథకం ప్రయోజనం అందించాలని, బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని స్పష్టం చేశారు. రేషన్ కార్డుల ఆధారంగా కుటుంబాలను గుర్తించడంతో పాటు రేషన్ కార్డుల్లో పేర్లు లేని వారు, రేషన్ కార్డులు లేని కుటుంబాలకు కూడా ప్రత్యేక దరఖాస్తు విధానం ద్వారా నమోదు అవకాశం కల్పించాలని తెలిపారు. ఆధార్ ఆధారిత పుట్టిన తేదీ, కుటుంబ సభ్యులు, నామినీల వివరాలను ఎలాంటి తప్పులు లేకుండా నమోదు చేయాలని, మీ సేవ కేంద్రాల ద్వారా కూడా అవసరమైన సేవలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ, జిల్లాలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీల ఆధ్వర్యంలో నమోదు ప్రక్రియ చేపట్టనున్నట్లు వివరించారు. పథకం అమలుపై ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. మండల స్థాయి అధికారులు, వార్డు అధికారులకు ప్రభుత్వం నిర్దేశించిన ప్రామాణిక కార్యాచరణ విధానంపై (ఎస్‌ఓపీ) శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు. నమోదు ప్రక్రియ వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎంపీడీవోలు, మున్సిపాలిటీలకు ప్రత్యేక లాగిన్ సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు.జిల్లాలోని ప్రతి నమోదు శిబిరంలో ఇంటర్నెట్ కనెక్షన్, ప్రింటర్, స్కానర్ వంటి సాంకేతిక సదుపాయాలు ఏర్పాటు చేశామని, అన్ని గ్రామాల్లో శిబిరాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. ముందుగా నింపిన దరఖాస్తు ఫారాలను కూడా శిబిరాల్లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు.ప్రజాప్రతినిధులు, గ్రామపంచాయతీ సిబ్బంది, మున్సిపల్ అధికారులు, సంబంధిత శాఖల సమన్వయంతో ప్రతి అర్హ కుటుంబానికి పథకంపై అవగాహన కల్పించి, నమోదు ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ ఆర్ఎస్ చిత్రు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఐటీడీఏ పీఓ మంద మకరంద్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.