telangana
12వ డివిజన్లో పారిశుధ్య సిబ్బందిని పెంచాలని అధికారులకు కార్పొరేటర్ కస్తూరి నాగరాజు విజ్ఞప్తి
సూర్య మంచిర్యాల: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 12వ డివిజన్లో పారిశుధ్యం,విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కార్పొరేటర్ కస్తూరి నాగరాజు మున్సిపల్ అధికారులు,సిబ్బందితో కలిసి డివిజన్లో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.విద్యుత్ తీగలకు తగులుతూ ప్రమాదకరంగా మారిన చెట్ల కొమ్మలను తొలగించే పనులు చేపట్టారు.అలాగే డివిజన్లోని పారిశుధ్య పనులు,డ్రైనేజీల పరిస్థితిని పరిశీలించి సంబంధిత సిబ్బందికి పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా కస్తూరి నాగరాజు మాట్లాడుతూ డివిజన్లో పారిశుధ్య సిబ్బంది కొరత కారణంగా పనులు ఆలస్యమవుతున్నాయని తెలిపారు.ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పారిశుధ్య సిబ్బంది సంఖ్యను పెంచాలని మున్సిపల్ అధికారులను కోరారు.పారిశుధ్య పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ వేగవంతం చేయాలని సూచించారు.డివిజన్ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించడంతో పాటు అభివృద్ధి పనులకు నిరంతరం కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.