సూర్య మంచిర్యాల: వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాల పెంపునకు దోహదపడే రూఫ్‌టాప్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అధికారులను ఆదేశించారు.బుధవారం కోటపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద నిర్మిస్తున్న రూఫ్‌టాప్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.అలాగే సర్వాయిపేట గ్రామ పంచాయతీలో వి.బి.జి. రామ్ జి పథకం కింద చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిని ఎంపీడీవో,మండల పంచాయతీ అధికారులతో కలిసి సమీక్షించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వర్షపు నీటి సంరక్షణ, నీటి పొదుపు పనులకు ప్రాధాన్యతనిస్తూ నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు.పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటిస్తూ నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.వర్షపు నీటిని సమర్థవంతంగా ఒడిసిపట్టేలా నిర్మాణాలు చేపట్టాలని తెలిపారు.అలాగే వి.బి.జి. రామ్ జి పథకం కింద చేపడుతున్న అభివృద్ధి పనులను అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తూ సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి,టెక్నికల్ అసిస్టెంట్,మేట్లు, సర్పంచ్,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.