BREAKING
మండల పరిషత్ ఉపాధ్యక్షులు(వైస్ ఎంపీపీ) ఎంపికకు ఎమ్మెల్యే ఏలూరి సిఫార్సు ఎన్విడియా అంచనాలతో డిమాండ్ భయాలు మాయం, భారీ లాభాల్లో టెక్ స్టాక్స్ పడిపోయిన కమోడిటీ ధరలు, ఫెడ్ మినిట్స్‌పైనే ఇన్వెస్టర్ల దృష్టి బుడంపాడు కాల్వలో మహిళ మృత దేహం కలకలం ఫార్మసిస్టులకు వైద్య సేవలకు వేతనం ఉపాధ్యాయ ఎం.ఎల్.సి ఓటరుకు డిసెంబరు 23 నుండి జనవరి 12 వరకు మరో అవకాశం కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఘన విజయం సాధిస్తాం: *ఎంపీ సానా సతీష్ బాబు ఇథన్ అలెన్ బోర్డులో యాక్టివిస్ట్ ఇన్వెస్టర్ డగ్ బర్గెన్ హవా మంత్రి పయ్యావుల కేశవ్‌ను కలిసిన గంజే నాగరాజు పేదవాడికి సంక్షేమం పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం - మంత్రి పొంగిలేటి హకీమ్ జెఫ్రీస్ స్పీకర్ అభ్యర్థిత్వంపై డెమొక్రటిక్ పార్టీలో అంతర్గత చర్చలు చిట్టమూరు సర్పంచ్ బరిలో బద్దిగ విజయలక్ష్మి మాజీ మండల పరిషత్ ఉపాధ్యక్షులు బద్దిగ వెంకటరమణయ్య సతీమణి నామినేషన్ దాఖలు బీఆర్ఎస్ జెండా గద్దె కూల్చివేతపై భగ్గుమన్న జీవీ రామకృష్ణారావు శ్రీకాళహస్తి మున్సిపల్ ఎన్నికలలో సిపిఎం అభ్యర్థులు వీణవంకకు కొత్త సహకార సంఘం..

పోటీ పరీక్షలపై అవగాహన సదస్సు.. ఉత్సాహంగా క్విజ్ పోటీలు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలి:గ్రంథాలయ అధికారి ఎన్. శ్రీనివాసులు

Select Suryaa Now
పోటీ పరీక్షలపై అవగాహన సదస్సు.. ఉత్సాహంగా క్విజ్ పోటీలు  గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలి:గ్రంథాలయ అధికారి ఎన్. శ్రీనివాసులు

సూళ్ళూరుపేట మేజర్ న్యూస్

59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా సూళ్ళూరుపేట శాఖ లైబ్రేరియన్ ఎన్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 

విద్యార్థులకు పోటీ పరీక్షలపై అవగాహన సదస్సుతో పాటు క్విజ్ పోటీలను నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రంథాలయ ఉద్యమ పితామహులు, ప్రముఖుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రంథాలయ అధికారి ఎన్ శ్రీనివాసులు మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞానానికి నిలయాలని, విద్యార్థులు ఇంటర్మీడియట్ స్థాయి నుంచే పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. గ్రూప్స్,బ్యాంకింగ్,రైల్వే,పోలీస్, డీఎస్సీ తదితర పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు, దినపత్రికలు,మ్యాగజైన్లు బ్రాంచి గ్రంథాలయంలో అందుబాటులో ఉన్నాయని, విద్యార్థులు సభ్యత్వం తీసుకుని ఉచితంగా సద్వినియోగం చేసుకోవాలన్నారు.కళాశాల ప్రిన్సిపాల్ కె శ్యామ్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే పాఠ్యపుస్తకాలతో పాటు జనరల్ నాలెడ్జ్,సమకాలీన అంశాలు,రీజనింగ్,సమయ పాలనపై అవగాహన పెంచుకోవాలన్నారు.మొబైల్ ఫోన్ల వినియోగాన్ని తగ్గించి పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలన్నారు.అనంతరం నిర్వహించిన క్విజ్ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.భారత చరిత్ర, రాజ్యాంగం,జనరల్ సైన్స్, క్రీడలు,కరెంట్ అఫైర్స్ అంశాలపై అడిగిన ప్రశ్నలకు పోటీపడి సమాధానాలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది,కళాశాల అధ్యాపకులు,పాఠకులు, విద్యార్థులు పాల్గొన్నారు.