బీఆర్ఎస్ జెండా గద్దె కూల్చివేతపై భగ్గుమన్న జీవీ రామకృష్ణారావు
సూర్య - మానకొండూర్ :మానకొండూర్ మండలం నిజాయితీగూడెం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ జెండా గద్దెను గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేయడం స్థానికంగా కలకలం రేపింది. మొన్న రాత్రి సుత్తితో కొట్టి జెండా గద్దెను పూర్తిగా కూల్చివేయడంపై బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన జీవీ రామకృష్ణారావు, ఇప్పటికే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. పోలీసులు తక్షణమే స్పందించి ఈ దుశ్చర్యకు పాల్పడిన నిందితులపై విచారణ జరిపి, బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.ప్రజల గుండెల్లో కేసీఆర్ చెరగని ముద్ర: ఈ సందర్భంగా జీవీ రామకృష్ణారావు మాట్లాడుతూ.. నిజాయితీగూడెం గ్రామంలో పార్టీ కార్యకర్తలు ఎంతో చురుగ్గా ఉంటూ, నిత్యం రైతులు ప్రజా సమస్యలపై పోరాడుతున్నారని తెలిపారు. దీనిని జీర్ణించుకోలేని కొందరు వ్యక్తులు, కార్యకర్తలను మానసికంగా వేధించాలనే దురుద్దేశంతోనే జెండా గద్దెను కూల్చివేశారని ఆరోపించారు.
"దుండగులు జెండా గద్దెను కూల్చగలరేమో కానీ, గ్రామ ప్రజల గుండెల్లో ఉన్న కేసీఆర్ ని ఏమాత్రం కదిలించలేరన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలంతా మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఇలాంటి పిచ్చి వేషాలు మానుకోకపోతే, మేము తలచుకుంటే గ్రామంలో ఏ పార్టీ జెండాలు కూడా మిగలవు" అని హెచ్చరించారు. దోషులను గుర్తించిన మరుసటి రోజే దీనికి పదిరెట్ల స్థాయిలో బీఆర్ఎస్ సత్తా ఏంటో చూపిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తాళ్లపల్లి శేఖర్ గౌడ్,శ్రీనివాస్ నగర్ సర్పంచ్ ఎరుకల శ్రీనివాస్ గౌడ్, నిజాయితీ గూడెం గ్రామ శాఖ అధ్యక్షులు సామంతుల శ్రీనివాస్,నాయకులు శాతరాజు యాదగిరి, రామంచ గోపాల్ రెడ్డి,గడ్డి గణేష్,ఆడెపు రమేష్,సండేసరి ప్రసాద్,కాల్వ సంపత్, గుమ్మడి మధు,గడ్డి కుమార్,కేంసారం కుమార్,గడ్డి రమేష్,ఏడ్ల లక్ష్మారెడ్డి,రాములు,అంజయ్య పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొని 'జై తెలంగాణ' అంటూ నినాదాలు చేశారు...