BREAKING
మండల పరిషత్ ఉపాధ్యక్షులు(వైస్ ఎంపీపీ) ఎంపికకు ఎమ్మెల్యే ఏలూరి సిఫార్సు ఎన్విడియా అంచనాలతో డిమాండ్ భయాలు మాయం, భారీ లాభాల్లో టెక్ స్టాక్స్ పడిపోయిన కమోడిటీ ధరలు, ఫెడ్ మినిట్స్‌పైనే ఇన్వెస్టర్ల దృష్టి బుడంపాడు కాల్వలో మహిళ మృత దేహం కలకలం ఫార్మసిస్టులకు వైద్య సేవలకు వేతనం ఉపాధ్యాయ ఎం.ఎల్.సి ఓటరుకు డిసెంబరు 23 నుండి జనవరి 12 వరకు మరో అవకాశం కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఘన విజయం సాధిస్తాం: *ఎంపీ సానా సతీష్ బాబు ఇథన్ అలెన్ బోర్డులో యాక్టివిస్ట్ ఇన్వెస్టర్ డగ్ బర్గెన్ హవా మంత్రి పయ్యావుల కేశవ్‌ను కలిసిన గంజే నాగరాజు పేదవాడికి సంక్షేమం పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం - మంత్రి పొంగిలేటి హకీమ్ జెఫ్రీస్ స్పీకర్ అభ్యర్థిత్వంపై డెమొక్రటిక్ పార్టీలో అంతర్గత చర్చలు చిట్టమూరు సర్పంచ్ బరిలో బద్దిగ విజయలక్ష్మి మాజీ మండల పరిషత్ ఉపాధ్యక్షులు బద్దిగ వెంకటరమణయ్య సతీమణి నామినేషన్ దాఖలు బీఆర్ఎస్ జెండా గద్దె కూల్చివేతపై భగ్గుమన్న జీవీ రామకృష్ణారావు శ్రీకాళహస్తి మున్సిపల్ ఎన్నికలలో సిపిఎం అభ్యర్థులు వీణవంకకు కొత్త సహకార సంఘం..

శ్రీ మడేలేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్

Select Suryaa Now
శ్రీ మడేలేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్

సూర్య..బోయినపల్లి మండలం రత్నంపేట గ్రామంలో రజక కులస్తులు ఏర్పాటుచేసిన శ్రీ మడేలేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి చొప్పదండి మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రజక సంఘం నాయకులు సుంకె రవిశంకర్ ను శాలువాతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు. వేద పండితులు ఆశీర్వదించారు.
అనంతరం రవిశంకర్ మాట్లాడుతూ, శ్రీ మడేలయ్య స్వామి విగ్రహ ప్రతిష్ట వంటి మహోన్నతమైన కార్యక్రమానికి తనను ఆహ్వానించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. స్వామివారి ఆశీస్సులు నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలపై ఉండాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య, మాజీ మండల కో ఆప్షన్ సభ్యులు మహ్మద్ అజ్జూ, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గుంటి శంకర్, యూత్ నాయకులు గిరిజాల కోటి, పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు.