BREAKING
మండల పరిషత్ ఉపాధ్యక్షులు(వైస్ ఎంపీపీ) ఎంపికకు ఎమ్మెల్యే ఏలూరి సిఫార్సు ఎన్విడియా అంచనాలతో డిమాండ్ భయాలు మాయం, భారీ లాభాల్లో టెక్ స్టాక్స్ పడిపోయిన కమోడిటీ ధరలు, ఫెడ్ మినిట్స్‌పైనే ఇన్వెస్టర్ల దృష్టి బుడంపాడు కాల్వలో మహిళ మృత దేహం కలకలం ఫార్మసిస్టులకు వైద్య సేవలకు వేతనం ఉపాధ్యాయ ఎం.ఎల్.సి ఓటరుకు డిసెంబరు 23 నుండి జనవరి 12 వరకు మరో అవకాశం కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఘన విజయం సాధిస్తాం: *ఎంపీ సానా సతీష్ బాబు ఇథన్ అలెన్ బోర్డులో యాక్టివిస్ట్ ఇన్వెస్టర్ డగ్ బర్గెన్ హవా మంత్రి పయ్యావుల కేశవ్‌ను కలిసిన గంజే నాగరాజు పేదవాడికి సంక్షేమం పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం - మంత్రి పొంగిలేటి హకీమ్ జెఫ్రీస్ స్పీకర్ అభ్యర్థిత్వంపై డెమొక్రటిక్ పార్టీలో అంతర్గత చర్చలు చిట్టమూరు సర్పంచ్ బరిలో బద్దిగ విజయలక్ష్మి మాజీ మండల పరిషత్ ఉపాధ్యక్షులు బద్దిగ వెంకటరమణయ్య సతీమణి నామినేషన్ దాఖలు బీఆర్ఎస్ జెండా గద్దె కూల్చివేతపై భగ్గుమన్న జీవీ రామకృష్ణారావు శ్రీకాళహస్తి మున్సిపల్ ఎన్నికలలో సిపిఎం అభ్యర్థులు వీణవంకకు కొత్త సహకార సంఘం..

తెలంగాణ ఇచ్చిన చరిత్రను కేటీఆర్ మరిచిపోయారా? డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్

Select Suryaa Now
తెలంగాణ ఇచ్చిన చరిత్రను కేటీఆర్ మరిచిపోయారా? డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్

సూర్య, తెలంగాణ బ్యూరో ప్రతినిధిః సోనియా గాంధీ ఆత్మకథలో తెలంగాణ ప్రస్తావన లేదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ చైర్మన్ డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వెనుక సోనియా గాంధీ చేసిన చారిత్రక త్యాగాలను గుర్తు చేస్తూ కేటీఆర్ వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. సోనియా గాంధీ చొరవతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, రాష్ట్రం ఏర్పడకపోయి ఉంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండేది కాదని చరణ్ కౌశిక్ యాదవ్ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటుతోనే కేటీఆర్‌కు రెండుసార్లు మంత్రి పదవితో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కాయని గుర్తుచేశారు. 543 మంది సభ్యులున్న లోక్‌సభలో బీఆర్ఎస్‌కు కేవలం ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉండగా, 245 మంది సభ్యులున్న రాజ్యసభలో ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేదని అన్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తనకున్న పార్లమెంటరీ బలంతో పాటు మిత్రపక్షాలను ఒప్పించి తెలంగాణ బిల్లుకు ఆమోదం పొందేలా చేసిందని వివరించారు.
ఎ.రవీందర్‌, హైదరాబాద్‌.