BREAKING
మండల పరిషత్ ఉపాధ్యక్షులు(వైస్ ఎంపీపీ) ఎంపికకు ఎమ్మెల్యే ఏలూరి సిఫార్సు ఎన్విడియా అంచనాలతో డిమాండ్ భయాలు మాయం, భారీ లాభాల్లో టెక్ స్టాక్స్ పడిపోయిన కమోడిటీ ధరలు, ఫెడ్ మినిట్స్‌పైనే ఇన్వెస్టర్ల దృష్టి బుడంపాడు కాల్వలో మహిళ మృత దేహం కలకలం ఫార్మసిస్టులకు వైద్య సేవలకు వేతనం ఉపాధ్యాయ ఎం.ఎల్.సి ఓటరుకు డిసెంబరు 23 నుండి జనవరి 12 వరకు మరో అవకాశం కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఘన విజయం సాధిస్తాం: *ఎంపీ సానా సతీష్ బాబు ఇథన్ అలెన్ బోర్డులో యాక్టివిస్ట్ ఇన్వెస్టర్ డగ్ బర్గెన్ హవా మంత్రి పయ్యావుల కేశవ్‌ను కలిసిన గంజే నాగరాజు పేదవాడికి సంక్షేమం పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం - మంత్రి పొంగిలేటి హకీమ్ జెఫ్రీస్ స్పీకర్ అభ్యర్థిత్వంపై డెమొక్రటిక్ పార్టీలో అంతర్గత చర్చలు చిట్టమూరు సర్పంచ్ బరిలో బద్దిగ విజయలక్ష్మి మాజీ మండల పరిషత్ ఉపాధ్యక్షులు బద్దిగ వెంకటరమణయ్య సతీమణి నామినేషన్ దాఖలు బీఆర్ఎస్ జెండా గద్దె కూల్చివేతపై భగ్గుమన్న జీవీ రామకృష్ణారావు శ్రీకాళహస్తి మున్సిపల్ ఎన్నికలలో సిపిఎం అభ్యర్థులు వీణవంకకు కొత్త సహకార సంఘం..

వీణవంకకు కొత్త సహకార సంఘం..

Select Suryaa Now
వీణవంకకు కొత్త సహకార సంఘం..

సూర్య వీణవంక: రైతులకు మరింత చేరువగా సహకార సంఘాల సేవలను అందించేందుకు ప్రభుత్వం కొత్తగా సహకార సంఘాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లాలో ప్రస్తుతం ఉన్న సహకార సంఘాలకు అదనంగా ఏడు కొత్త సంఘాలను ఏర్పాటు చేయడానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.కొత్తగా ఏర్పాటు కానున్న సంఘాల జాబితాలో చల్లూరు (వీణవంక) కూడా ఉండడంతో మండలంలోని రైతులకు సహకార సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయి. పెద్దగా ఉన్న సహకార సంఘాలను పునర్వ్యవస్థీకరించి కొత్త సింగిల్‌ విండోలను ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు పంట రుణాలు, వ్యవసాయానికి సంబంధించిన సేవలు, ఇతర సహకార కార్యక్రమాలు స్థానికంగానే అందే అవకాశం ఏర్పడనుంది.రైతులు వడ్డీ వ్యాపారులపై ఆధారపడకుండా తక్కువ వడ్డీకి రుణాలు పొందేందుకు సహకార సంఘాలు కీలకంగా పనిచేస్తున్నాయి. కొత్త సంఘాల ఏర్పాటుతో రైతులకు రుణాలు, ఎరువులు, విత్తనాలు తదితర వ్యవసాయ అవసరాలకు సంబంధించిన సేవలు మరింత సులభంగా అందే అవకాశం ఉంది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 25 కొత్త సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా, కరీంనగర్ జిల్లాలో ఏడు సంఘాలు ఏర్పాటు కానున్నాయి. ఇందులో వీణవంక మండలానికి చెందిన చల్లూరు సహకార సంఘం కూడా ఉండటంతో స్థానిక రైతుల్లో ఆశలు నెలకొన్నాయి.