BREAKING
మండల పరిషత్ ఉపాధ్యక్షులు(వైస్ ఎంపీపీ) ఎంపికకు ఎమ్మెల్యే ఏలూరి సిఫార్సు ఎన్విడియా అంచనాలతో డిమాండ్ భయాలు మాయం, భారీ లాభాల్లో టెక్ స్టాక్స్ పడిపోయిన కమోడిటీ ధరలు, ఫెడ్ మినిట్స్‌పైనే ఇన్వెస్టర్ల దృష్టి బుడంపాడు కాల్వలో మహిళ మృత దేహం కలకలం ఫార్మసిస్టులకు వైద్య సేవలకు వేతనం ఉపాధ్యాయ ఎం.ఎల్.సి ఓటరుకు డిసెంబరు 23 నుండి జనవరి 12 వరకు మరో అవకాశం కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఘన విజయం సాధిస్తాం: *ఎంపీ సానా సతీష్ బాబు ఇథన్ అలెన్ బోర్డులో యాక్టివిస్ట్ ఇన్వెస్టర్ డగ్ బర్గెన్ హవా మంత్రి పయ్యావుల కేశవ్‌ను కలిసిన గంజే నాగరాజు పేదవాడికి సంక్షేమం పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం - మంత్రి పొంగిలేటి హకీమ్ జెఫ్రీస్ స్పీకర్ అభ్యర్థిత్వంపై డెమొక్రటిక్ పార్టీలో అంతర్గత చర్చలు చిట్టమూరు సర్పంచ్ బరిలో బద్దిగ విజయలక్ష్మి మాజీ మండల పరిషత్ ఉపాధ్యక్షులు బద్దిగ వెంకటరమణయ్య సతీమణి నామినేషన్ దాఖలు బీఆర్ఎస్ జెండా గద్దె కూల్చివేతపై భగ్గుమన్న జీవీ రామకృష్ణారావు శ్రీకాళహస్తి మున్సిపల్ ఎన్నికలలో సిపిఎం అభ్యర్థులు వీణవంకకు కొత్త సహకార సంఘం..

పేదవాడికి సంక్షేమం పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం - మంత్రి పొంగిలేటి

Select Suryaa Now
పేదవాడికి సంక్షేమం పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం - మంత్రి పొంగిలేటి

రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల కొత్త పెన్షన్లకు ఆమోదం

కుల, మత, రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు

మహిళా సంఘాలకు స్వయం ఉపాధి అవకాశాలు.. 33 నెలల్లో రూ.73 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు

కల్లూరు పట్టణ అభివృద్ధికి రూ.15 కోట్ల నిధులు మంజూరు

కల్లూరు పట్టణంలో నూతన పెన్షన్ లబ్ధిదారులకు ప్రోసిడింగ్స్ పంపిణీ చేసిన మంత్రి పొంగులేటి

కల్లూరు, సూర్య మేజర్ న్యూస్....
అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. బుధవారం కల్లూరు పట్టణంలోని వికేఆర్ ఫంక్షన్ హాల్‌లో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి కల్లూరు మండలం, మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా మంజూరైన చేయూత పెన్షన్ లబ్ధిదారులకు మంత్రి పెన్షన్ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.

*ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ* గత పాలకులు రాష్ట్రంపై రూ.8 లక్షల 21 వేల కోట్ల అప్పుల భారం మోపినప్పటికీ పేదలకు అందించే సంక్షేమ కార్యక్రమాల అమలులో ఎలాంటి కోతలు విధించకుండా, రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు.
గత పదేళ్లలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా మంజూరు చేయని పరిస్థితి ఉండగా, ప్రజా ప్రభుత్వం అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డులు మంజూరు చేసిందన్నారు మంత్రి పొంగులేటి అన్నారు.
పేదల చిరకాల స్వప్నమైన సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం మొదటి విడతలో నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని, రెండవ విడతలో 2.5 లక్షల ఇళ్లు, హైదరాబాద్ ప్రాంతంలో మరో లక్ష ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. పేదింటి మహిళలు సొంతంగా ఇళ్లు నిర్మించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.40 వేల కోట్లు ఖర్చు చేస్తోందన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల నూతన పెన్షన్లు మంజూరు చేశారని మంత్రి అన్నారు. 
గత పాలకులు పేదలకు ఇళ్లు మంజూరు చేయడం వల్ల తమకు ఏం ప్రయోజనం ఉంటుందని భావించి, పేదల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేశారని మంత్రి విమర్శించారు.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హుల కోసం రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్నర లక్షల నూతన పెన్షన్లు మంజూరు చేశామని తెలిపారు. ప్రతిపక్ష నాయకులైన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గాల్లోనూ ఎలాంటి వివక్ష లేకుండా ఇందిరమ్మ ఇళ్లు, నూతన పెన్షన్లు మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు.
కల్లూరు మండలం, మున్సిపాలిటీ పరిధిలో సుమారు 1,249 మందికి పాతవి, కొత్తవి కలిపి ప్రతి నెలా సుమారు రూ.2 కోట్ల 18 లక్షలు పెన్షన్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పెన్షన్ మంజూరు కాని అర్హులైన వారు నిరుత్సాహ పడవద్దని, అర్హులందరికీ దశలవారీగా పెన్షన్లు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అంచనా వేస్తూ ఒక్కో సంక్షేమ పథకాన్ని అమలు చేస్తున్నామని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని మంత్రి తెలిపారు. ప్రతిపక్ష నాయకులు అధికారంలో ఉన్నప్పుడు లక్ష కోట్ల రూపాయలు దోచుకున్నారని, ప్రస్తుతం ఆ నిధులతో సోషల్ మీడియాలో ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తూ, ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న మంచి కార్యక్రమాలను తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షాలు ఎంత ఆక్రోశం వ్యక్తం చేసినా పేదల సంక్షేమ కార్యక్రమాలను ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నాయకులు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను స్వాగతించాలని హితవు పలికారు.

సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ* ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతో పాటు పేద ప్రజలకు అవసరమైన అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆలోచించి అమలు చేస్తోందన్నారు. మహిళా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిందని, 
ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుండి రూ. 10లక్షలు పెంచామని అన్నారు.
బీసీ, మైనారిటీ విద్యార్థులు అన్ని ఆధునిక సౌకర్యాలతో ఒకే చోట విద్యను అభ్యసించేలా 25 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను నిర్మిస్తున్నామని తెలిపారు.

 

గతంలో ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేదలకు ఇళ్లు అందించారని, ఆ తర్వాత గత పాలకులు పేదలకు ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని ఎమ్మెల్యే అన్నారు.ఈ కార్యక్రమంలో కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, కల్లూరు మున్సిపల్ ఛైర్మన్, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, పెన్షన్ లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.