BREAKING
మంత్రి పయ్యావుల కేశవ్‌ను కలిసిన గంజే నాగరాజు పేదవాడికి సంక్షేమం పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం - మంత్రి పొంగిలేటి హకీమ్ జెఫ్రీస్ స్పీకర్ అభ్యర్థిత్వంపై డెమొక్రటిక్ పార్టీలో అంతర్గత చర్చలు చిట్టమూరు సర్పంచ్ బరిలో బద్దిగ విజయలక్ష్మి మాజీ మండల పరిషత్ ఉపాధ్యక్షులు బద్దిగ వెంకటరమణయ్య సతీమణి నామినేషన్ దాఖలు బీఆర్ఎస్ జెండా గద్దె కూల్చివేతపై భగ్గుమన్న జీవీ రామకృష్ణారావు శ్రీకాళహస్తి మున్సిపల్ ఎన్నికలలో సిపిఎం అభ్యర్థులు వీణవంకకు కొత్త సహకార సంఘం.. మెటా భారీ పందెం...మ్యూజ్ ఏఐ ఏజెంట్ రంగప్రవేశం శ్రీ మడేలేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పోటీ పరీక్షలపై అవగాహన సదస్సు.. ఉత్సాహంగా క్విజ్ పోటీలు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలి:గ్రంథాలయ అధికారి ఎన్. శ్రీనివాసులు తెలంగాణ ఇచ్చిన చరిత్రను కేటీఆర్ మరిచిపోయారా? డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ అమెరికా కాంగ్రెస్‌లో కీలక శక్తి అనుమతుల సంస్కరణ బిల్లు పొగాకు పంపిణీ గుత్తపతకం రద్దుకు ప్రణాళికలు ప్రభుత్వ సిసి తో ఆర్టీసీ ఎండీ డాక్టర్ అనిల్ గ్లోబల్ సిమెంట్ పరిశ్రమలో కార్బన్ ఉద్గారాల కోతకు తీవ్ర కసరత్తు

ఓటరు జాబితాలో పేరు లేని వారికి మరో అవకాశం - డిసెంబర్ 22న తుది ఓటరు జాబితా ప్రచురణ - కలెక్టర్ రాజర్షి షా

Select Suryaa Now
ఓటరు జాబితాలో పేరు లేని వారికి మరో అవకాశం - డిసెంబర్ 22న తుది ఓటరు జాబితా ప్రచురణ - కలెక్టర్ రాజర్షి షా
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి : ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటరు జాబితాలో పేర్లు లేని ఏఎస్డీడీ ఓటర్లకు తిరిగి పేరు నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించిందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా బుదవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఏఎస్డీడీ ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ ప్రక్రియ నవంబర్ 18 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు, డిసెంబర్ 10లోగా ఫారాల పరిశీలన పూర్తి చేయనున్నట్లు తెలిపారు. క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ, పరిష్కార గడువును డిసెంబర్ 15 వరకు పొడిగించగా, తుది ఓటరు జాబితాను డిసెంబర్ 22న ప్రచురించనున్నట్లు వెల్లడించారు.అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో పరిశీలించుకోవాలని, పేరు లేని వారు అవసరమైన పత్రాలతో సంబంధిత బూత్ స్థాయి అధికారిని (BLO) సంప్రదించి నమోదు చేసుకోవాలని సూచించారు. సందేహాల నివృత్తికి ఎన్నికల సంఘం టోల్ ఫ్రీ నంబర్ 1950ను సంప్రదించాలని కలెక్టర్ కోరారు.