BREAKING
శబరిమలకు యువకుడి సైకిల్ యాత్ర డిజిటల్ రేషన్ కార్డులు పంపిణీ ఉత్తమ గ్రంథాలయ అధికారిగా అవార్డు అందుకున్న సత్యం బాబుకు ఘన సన్మానం. రాకెట్ తయారీ సంస్థ 'అవియో' కొనుగోలుపై స్పందించని రోమ్ తాళ్ళపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ 19 నుంచి చేయూత పెన్షన్ డబ్బులు నేరుగా ఖాతాలోకి .. కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎమ్మెల్యే మేడిపల్లి బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా రాకపై అల్లర్లు, మోహరించిన అర్ధసైనిక దళాలు ఓటరు జాబితాలో పేరు లేని వారికి మరో అవకాశం - డిసెంబర్ 22న తుది ఓటరు జాబితా ప్రచురణ - కలెక్టర్ రాజర్షి షా ‘ది ఏజ్ ఆఫ్ భారత్’ గేమ్ కోసం అన్నపూర్ణ స్టూడియోస్ కీలక భాగస్వామ్యం.. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో సరికొత్త రికార్డు ఖేలో ఇండియా వేదికపై కరీంనగర్ క్రీడా వైభవం ఎస్ ఆర్ బాలికకు జాతీయ స్థాయిలో ఘనత భారత్-జపాన్ మధ్య రక్షణ, వ్యూహాత్మక భాగస్వామ్యంపై సమీక్ష షెన్‌జెన్ చేరిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి మ్యాజికల్ కాంబో రిపీట్.. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్‌తో భరత్ బాలా ‘బనారస్’ మూవీ దీక్షా దివస్ సభను విజయవంతం చేయండి…మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి

స్థానిక ఎన్నికల్లో కూటమి ఐక్యత శాశ్వతం కావాలి..

Select Suryaa Now
స్థానిక ఎన్నికల్లో కూటమి ఐక్యత శాశ్వతం కావాలి..
అమరావతి, నవంబర్ 18: రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలతో పాటు మిగిలిన 23 పట్టణ స్థానిక సంస్థల (రెండో దశ) ఎన్నికల సన్నద్ధతపై తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం పార్టీ నేతలు, శ్రేణులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి వార్డులోనూ కూటమి జెండా ఎగరాలని, అందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య ఐక్యత శాశ్వతంగా కొనసాగాలని, ప్రతి ఒక్కరూ పొత్తు ధర్మాన్ని విధిగా పాటించాలని చంద్రబాబు స్పష్టం చేశారు.
 
2024 ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం కంటే ఈసారి గణనీయంగా పెరిగేలా లక్ష్యంతో పనిచేయాలని చంద్రబాబు శ్రేణులకు సూచించారు. ఏ ఒక్క వార్డులో ఓడిపోయినా అందుకు గల కారణాలను లోతుగా విశ్లేషిస్తానని హెచ్చరించిన ఆయన, గ్రామాలు మరియు నియోజకవర్గాల్లో కూటమి పార్టీల మధ్య సమన్వయాన్ని పరిశీలించి తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలే తప్ప, వ్యక్తిగత హననానికి పాల్పడేవారు రాజకీయాలకు అనర్హులని పేర్కొంటూ, ప్రజలకు వాస్తవాలను వివరించి ప్రతి ఎన్నికలోనూ కూటమి విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని సీఎం పిలుపునిచ్చారు.