BREAKING
కళ్యాణదుర్గం పట్టణంలో మారంపల్లి కాలనీలో ప్రారంభానికి సిద్ధమైన వాటర్ ప్లాంట్. 16 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమా ? బీసీ నేత, ఎంపీ ఆర్‌.కృష్ణయ్య వాతావరణ న్యాయం, సమానత్వం మరియు ఆర్థిక నిధులపై స్పష్టమైన డిమాండ్ రూ. 7,842కి పడిపోయిన క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ స్థానిక ఎన్నికల్లో కూటమి ఐక్యత శాశ్వతం కావాలి.. ఉత్తమ వెబ్ సిరీస్ అవార్డుకు ఐదు ప్రముఖ సిరీస్‌ల నామినేషన్లు భారతీయ చిత్రాలతో పాటు పర్యావరణ హిత చిత్రాలకు పెద్దపీట స్కాచ్ విస్కీ దిగుమతులపై టారిఫ్ వివాదం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు అరోబిందో ఫార్మా ఫౌండేషన్ రూ.కోటి విరాళం జాతీయ స్థాయి క్రీడా పోటీలకు తెలంగాణ వేదిక కావడం గర్వకారణంః మంత్రి వాకిటి శ్రీహరి హామీల అమలేది..? రైతుల ఎదురుచూపులెన్నాళ్లు? భోగం కిరణ్ కుమార్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. తలారి రంగయ్య. బల్గేరియా తీరంలో మునిగిపోయిన ఎల్పీజీ ట్యాంకర్ కింగ్ నాగార్జున వందో సినిమాపై వ్యక్తమవుతున్న ఆందోళనలు.. ప్రమోషన్లలో ఇంత సైలెన్స్ ఎందుకు? శక్తి పరివర్తనకు పెను ముప్పుగా మారుతున్న నీటి కొరత

భోగం కిరణ్ కుమార్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. తలారి రంగయ్య.

Select Suryaa Now
భోగం కిరణ్ కుమార్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. తలారి రంగయ్య.

కళ్యాణదుర్గం: కంబదూరు మండల కేంద్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి భోగం కిరణ్ కుమార్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని వైసీపీ మాజీ ఎంపీ, పార్టీ పీఏసీ సభ్యులు, కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య పిలుపునిచ్చారు. బుధవారం కళ్యాణదుర్గంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భోగం కిరణ్ కుమార్‌తో పాటు కంబదూరు మండలానికి చెందిన పలువురు వైసీపీ సీనియర్ నాయకులు తలారి రంగయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్థానిక రాజకీయ పరిస్థితులు, ఎన్నికల ప్రచారం, గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం తదితర అంశాలపై చర్చించారు. అనంతరం తలారి రంగయ్య మాట్లాడుతూ గ్రామాభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ప్రజల మద్దతు కూడగట్టేందుకు నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని సూచించారు. ప్రతి నాయకుడు, కార్యకర్త ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అభ్యర్థి విజయానికి కృషి చేయాలని కోరారు. గ్రామ ప్రజల ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతూ భోగం కిరణ్ కుమార్‌కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణుల సమష్టి కృషితో భోగం కిరణ్ కుమార్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తలారి రంగయ్య సూచించారు. ఈ కార్యక్రమంలో కంబదూరు మండల వైసీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.