BREAKING
విద్యార్థుల సంక్షేమానికి పెద్ద పీట - మంత్రి పొంగులేటి. ఉక్రెయిన్‌కు ఈయూ భారీ ఆర్థిక సాయం కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డ ఎంపీ చామల ఆయుష్మాన్ భారత్ చికిత్స ప్యాకేజీల పెంపు.. నాసా వాయేజర్-1 అద్భుతమైన మైలురాయి తిర్యాణిలో 20 మందికి పింఛను మంజూరు పత్రాల పంపిణీ ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష నేత మెెలంచన్ గెలిచే అవకాశం గంభీరావుపేటలో 19 మందికి పింఛను మంజూరు పత్రాల పంపిణీ నగరం ఎంపీపీగా మోర్ల స్వరూపరాణి టాలీవుడ్ నటుడు బండ్ల గణేశ్‌కు బిగ్ షాక్.. చెక్ బౌన్స్ కేసులో కోర్టు కీలక తీర్పు దృశ్యాల నిధిగా ఈ ఏడాది జ్ఞాపకాలు హోవార్డ్ లుట్నిక్ పై అమెరికా డెమొక్రాట్ల విచారణ ఓటీటీలో దూసుకుపోతున్న ఫీల్ గుడ్ మూవీ 'హ్యాపీ జర్నీ'.. డిజిటల్ వేదికగా ట్రెండింగ్‌లో నిలిచిన సినిమా భవిష్యత్తులో ఆ దేశానికి ఇంధన ఇబ్బందులు తప్పవన్న మాస్కో గ్రీన్ వాషింగ్‌కు పాల్పడిన ఈ-కామర్స్ దిగ్గజం అలెగ్రోకు భారీ జరిమానా

తిరుపతి–రేణిగుంట కేంద్రంగా ప్రత్యేక రైల్వే డివిజనల్ కార్యాలయం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి - ఎంపీ గురుమూర్తి

Select Suryaa Now
తిరుపతి–రేణిగుంట కేంద్రంగా ప్రత్యేక రైల్వే డివిజనల్ కార్యాలయం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి - ఎంపీ గురుమూర్తి

రేణిగుంట మేజర్ న్యూస్: తిరుపతి పార్లమెంట్ పరిధిలోని రైల్వే సమస్యలను పరిష్కరించాలని ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్‌కు వినతిపత్రం సమర్పించారు. గూడూరు రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను త్వరగా పూర్తి చేయడంతో పాటు, అదనపు ప్లాట్‌ఫామ్ ఏర్పాటు, పశ్చిమ వైపు బుకింగ్ కౌంటర్ అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. తిరుపతి, రేణిగుంట కేంద్రంగా ప్రత్యేక డివిజనల్ కార్యాలయం ఏర్పాటు చేయాలని, అప్పటివరకు గుంతకల్ డీఆర్‌ఎం వారానికి మూడు రోజులైనా ఈ ప్రాంతాల నుంచి పరిపాలనా కార్యకలాపాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే తిరుచానూరు రైల్వే స్టేషన్ పేరును తిరుపతి ఈస్ట్‌గా మార్చాలని, రేణిగుంట స్టేషన్ ఆధునీకరణకు నిధులు పెంచాలని, దుగరాజపట్నం రైల్వే కారిడార్ పనులను వేగవంతం చేయాలని కోరారు.