సూర్య తిర్యాణి : తిర్యాణి మండలం గంభీరావుపేట గ్రామపంచాయతీలో సర్పంచ్ జుమ్మడి కిష్టయ్య ఆధ్వర్యంలో 19 మంది లబ్ధిదారులకు పింఛను మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. పత్రాలు అందుకున్న లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ కిష్టయ్య మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. పింఛను మంజూరు కానివారు అధైర్యపడకుండా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వారి దరఖాస్తులను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని, గ్రామంలో అర్హులైన వారు పథకాలకు దూరం కాకుండా చర్యలు తీసుకుంటామని సర్పంచ్ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ ఆయిళ్ల మల్లేష్, కొరివి రజిత శ్రీనివాస్, జనగామ మౌనిక శేఖర్,సీనియర్ నాయకులు కడారి రమేష్ పాల్గొన్నారు