BREAKING
ఎస్ ఆర్ బాలికకు జాతీయ స్థాయిలో ఘనత భారత్-జపాన్ మధ్య రక్షణ, వ్యూహాత్మక భాగస్వామ్యంపై సమీక్ష షెన్‌జెన్ చేరిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి మ్యాజికల్ కాంబో రిపీట్.. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్‌తో భరత్ బాలా ‘బనారస్’ మూవీ దీక్షా దివస్ సభను విజయవంతం చేయండి…మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి కలమట మద్దతుతో రాజారావు మాస్టారు నామినేషన్ కు భారీ జన సముద్రం. కళ్యాణదుర్గం పట్టణంలో మారంపల్లి కాలనీలో ప్రారంభానికి సిద్ధమైన వాటర్ ప్లాంట్. 16 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమా ? బీసీ నేత, ఎంపీ ఆర్‌.కృష్ణయ్య వాతావరణ న్యాయం, సమానత్వం మరియు ఆర్థిక నిధులపై స్పష్టమైన డిమాండ్ రూ. 7,842కి పడిపోయిన క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ స్థానిక ఎన్నికల్లో కూటమి ఐక్యత శాశ్వతం కావాలి.. ఉత్తమ వెబ్ సిరీస్ అవార్డుకు ఐదు ప్రముఖ సిరీస్‌ల నామినేషన్లు భారతీయ చిత్రాలతో పాటు పర్యావరణ హిత చిత్రాలకు పెద్దపీట స్కాచ్ విస్కీ దిగుమతులపై టారిఫ్ వివాదం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు అరోబిందో ఫార్మా ఫౌండేషన్ రూ.కోటి విరాళం

యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు అరోబిందో ఫార్మా ఫౌండేషన్ రూ.కోటి విరాళం

Select Suryaa Now
యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు అరోబిందో ఫార్మా ఫౌండేషన్ రూ.కోటి విరాళం
హైదరాబాద్, నవంబర్ 18: మంచిరేవులలోని 'యంగ్ ఇండియా పోలీస్ స్కూల్' మౌలిక వసతుల అభివృద్ధికి అరోబిందో ఫార్మా ఫౌండేషన్ రూ.కోటి భారీ విరాళం అందించింది. ఈ మేరకు బుధవారం తెలంగాణ డీజీపీ సి.వి. ఆనంద్‌కు సంస్థ ప్రతినిధులు విరాళం చెక్కును అందజేశారు. అరోబిందో ఫార్మా లిమిటెడ్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, ఫౌండేషన్ డైరెక్టర్ కె. నిత్యానంద రెడ్డి తరఫున ఫౌండేషన్ సీఎస్‌ఆర్ హెడ్ ఎస్. సదానంద రెడ్డి, కార్పొరేట్ వ్యవహారాల ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఐ.ఎస్.ఆర్. రావు ఈ చెక్కును డీజీపీకి అందించారు.

ఈ విరాళం సమకూరడంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్, సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ ప్రత్యేక చొరవ చూపుతూ ఫౌండేషన్ ప్రతినిధులతో నిరంతరం సంప్రదింపులు జరిపారు. పాఠశాలలో మెరుగైన విద్యా సదుపాయాల కల్పన, మౌలిక వసతుల బలోపేతం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సమగ్ర అభివృద్ధికి ఈ ఆర్థిక సాయం ఎంతగానో దోహదపడనుంది. ఈ కార్యక్రమంలో మహిళా భద్రతా విభాగం డీజీ సౌమ్య మిశ్రా, హైదరాబాద్ సీపీ మహేశ్ భగవత్, ఏడీజీ (శాంతిభద్రతలు) అకున్ సబర్వాల్‌తో పాటు పలువురు ఉన్నత పోలీసు అధికారులు పాల్గొన్నారు.