ఎస్ ఆర్ బాలికకు జాతీయ స్థాయిలో ఘనత
అనంతపురము బ్యూరో మేజర్ న్యూస్ : ఎస్ ఆర్ జూనియర్ కళాశాల బాలికల ప్రాంగణము, ఆర్ డి టి స్టేడియం దగ్గర ఉన్న ఎస్సార్ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరము చదువుతున్న జీ.వీ.ఎం నమ్రత జాతీయ స్థాయిలో ఘనత సాధించారు.
నవంబర్ 11 తేదీ నుండి 15వవ తేదీల్లో మద్రాసులోని మహాబలిపురము దగ్గర జరిగిన అండర్ 17 ఫుట్బాల్ మద్రాస్ సూపర్ కప్ 2026 సూపర్ టోర్నమెంట్ కప్ పోటీలో జీ.వీ.ఎం నమ్రత ఫుట్ బాల్ టీం కెప్టెన్ గా వ్యవహరించి, జట్టును రన్నరప్ విజేతగా ద్వితీయ స్థానములో నిలిపారు. తన అద్భుతమైన ఆటతీరుతో, నాయకత్వ లక్షణాలతో అందరి ప్రశంసలు అందుకున్నారు.
ఈ సందర్భముగా ఎస్సార్ జూనియర్ కళాశాలలో జరిగిన అభినందన కార్యక్రమములో ఎస్ ఆర్ జూనియర్ కళాశాల, అనంతపురము డీన్ కె. రాధాకృష్ణ గారు జీవీఎం నమ్రతకు జ్ఞాపికను అందజేశారు.
ఈ కార్యక్రమములో ప్రిన్సిపల్ ఎం. భవాని గారు, ప్రిన్సిపల్ వి. వన్నప్ప గారు, ఏ .జి .ఎం సి జగన్మోహన్ రెడ్డి గారు, ఏ .జి .ఎం సి. కల్పన గారు పాల్గొని జీ.వీ.ఎం నమ్రతను అభినందించారు.
ఇంతటి ఘనత సాధించిన జీ.వీ.ఎం నమ్రత అమ్మాయిని ఎస్ ఆర్ విద్యా సంస్థల చైర్మన్ ఏ. వరదా రెడ్డి గారు, డైరెక్టర్లు ఏ. మధుకర్ రెడ్డి గారు, ఏ. సంతోష్ రెడ్డి గారు, సి .ఈ. ఓ. సురేంద్ర రెడ్డి గారు, జి. ఎం. రాజేంద్ర ప్రసాద్ గారు ప్రత్యేకముగా కొనియాడారు. కళాశాల సిబ్బంది కూడా జీ.వీ.ఎం నమ్రత అమ్మాయిని హృదయపూర్వకముగా అభినందించారు.
జీ.వీ.ఎం నమ్రత భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, కళాశాలకు, జిల్లాకు మరింత పేరు తీసుకురావాలని అందరూ ఆకాంక్షించారు.
రిపోర్టర్ : మొయినుద్దీన్ అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్.