చౌరస్తా పనులకు భూమిపూజ..
నారాయణపేట,(కోస్గి)సూర్య నవంబర్18:కోస్గి పట్టణంలోని శివాజి చౌరస్తా విస్తీరణ పనులకు కొడంగల్ నియోజకవర్గ ఇంచార్జ్ ఏనుముల తిరుపతి రెడ్డి బుధవారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి గ్రామగ్రామాన రహదారుల నిర్మాణం చేపట్టారని అన్నారు.కోస్గి పట్టణంలో శివాజీ చౌరస్తా విస్తీరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు..