BREAKING
విద్యార్థుల సంక్షేమానికి పెద్ద పీట - మంత్రి పొంగులేటి. ఉక్రెయిన్‌కు ఈయూ భారీ ఆర్థిక సాయం కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డ ఎంపీ చామల ఆయుష్మాన్ భారత్ చికిత్స ప్యాకేజీల పెంపు.. నాసా వాయేజర్-1 అద్భుతమైన మైలురాయి తిర్యాణిలో 20 మందికి పింఛను మంజూరు పత్రాల పంపిణీ ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష నేత మెెలంచన్ గెలిచే అవకాశం గంభీరావుపేటలో 19 మందికి పింఛను మంజూరు పత్రాల పంపిణీ నగరం ఎంపీపీగా మోర్ల స్వరూపరాణి టాలీవుడ్ నటుడు బండ్ల గణేశ్‌కు బిగ్ షాక్.. చెక్ బౌన్స్ కేసులో కోర్టు కీలక తీర్పు దృశ్యాల నిధిగా ఈ ఏడాది జ్ఞాపకాలు హోవార్డ్ లుట్నిక్ పై అమెరికా డెమొక్రాట్ల విచారణ ఓటీటీలో దూసుకుపోతున్న ఫీల్ గుడ్ మూవీ 'హ్యాపీ జర్నీ'.. డిజిటల్ వేదికగా ట్రెండింగ్‌లో నిలిచిన సినిమా భవిష్యత్తులో ఆ దేశానికి ఇంధన ఇబ్బందులు తప్పవన్న మాస్కో గ్రీన్ వాషింగ్‌కు పాల్పడిన ఈ-కామర్స్ దిగ్గజం అలెగ్రోకు భారీ జరిమానా

నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు..

Select Suryaa Now
నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు..
ముంబై, నవంబర్ 18: రెండు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడుతూ దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలు, గత రెండు రోజుల ర్యాలీ తర్వాత మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం సూచీలపై ఒత్తిడి పెంచింది. ఉదయం నుంచే బలహీనంగా కదలాడిన సూచీలు మధ్యాహ్నం సమయంలో మరింత కుంగి, చివరకు భారీ నష్టాల్లో స్థిరపడ్డాయి.

మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 500.38 పాయింట్లు (0.61 శాతం) నష్టపోయి 82,031.81 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 159.45 పాయింట్లు (0.63 శాతం) పతనమై 25,227.95 మార్కు వద్ద స్థిరపడింది. రంగాలవారీగా చూస్తే కన్స్యూమర్ డ్యూరబుల్స్, మెటల్, ఐటీ, ఆటో షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించగా.. పీఎస్‌యూ బ్యాంక్, మీడియా సూచీలు లాభపడ్డాయి. నిఫ్టీలో టైటాన్ కంపెనీ, హిందాల్కో ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు ప్రధానంగా నష్టపోగా.. సిప్లా, ఎస్‌బీఐ, డాక్టర్ రెడ్డీస్, అపోలో హాస్పిటల్స్ షేర్లు లాభాలతో ముగిశాయి.