-పేదల పక్షపాతి పల్లా జాన్ రాములు జయంతి సందర్భంగా ఉచిత వైద్య శిబిరం -- పల్లా కిరణ్ ఆధ్వర్యంలో ఉచితంగా మందులు, కళ్లజోళ్లు పంపిణీ
--పేదల పక్షపాతి పల్లా జాన్ రాములు జయంతి సందర్భంగా ఉచిత వైద్య శిబిరం
-- పల్లా కిరణ్ ఆధ్వర్యంలో ఉచితంగా మందులు, కళ్లజోళ్లు పంపిణీ
ఖమ్మం సూర్య (మేజర్ న్యూస్):
పేదల పక్షపాతి,పీడిత ప్రజల నాయకులు ఆయన చివరి క్షణం వరకు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన మహనీయులు స్వర్గీయ కీ.శే పల్లా జాన్ రాములు 88 జయంతి సందర్భంగా వారి కుమారుడు ప్రముఖ సమాజ సేవకుడు పల్లా కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత జనరల్ వైద్య శిబిరం మరియు ఉచిత జనరల్ కంటి వైద్య శిబిరాన్ని రిటైర్డ్ రెవ.కె.సేనం రాజు (బిషప్ డోర్నకల్) చేతుల మీదిగా ప్రారంభించం జరిగింది.స్థానిక ఖమ్మం మిషన్ హాస్పిటల్ ప్రాంగణంలో స్వర్గీయ కీ.శే శ్రీ పల్లా జాన్ రాములు జయంతి సందర్భంగా వారి కుమారుడు పల్లా కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత జనరల్ వైద్య శిబిరం ఉచిత జనరల్ కంటి వైద్య శిబిరం భారీ సక్సెస్ అయింది.ఈ వైద్య శిబిరానికి సుమారు 1000 మందికి పైగా నిరుపేద ప్రజలు వర్షాన్ని కూడా లెక్కచేయకుండా వైద్యం చేయించుకుని ఉచితంగా మందులు తీసుకోవడం జరిగింది.సుమారు 300 మంది పైగా నిరుపేద ప్రజలకు ఉచిత కళ్ళజోళ్ళు అందించడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని ఆర్.టి.రెవ.డా.కె.సేనం రాజు (బిషప్ డోర్నకల్) ప్రారంభించి, పెద్దలు ప్రముఖులు ప్రజలు స్వర్గీయ కీ. శే పల్లా జాన్ రాములు , పల్లా కిరణ్ సేవలను కొనియాడారు.బిషప్ తో పాటు, రెవ.డాక్టర్ విశ్వం,మిస్టర్ జి ప్రభాకర్ రావు, రెవ.బి. శ్రీనివాస్ పాల్, రెవ.ఇశ్రాల్ రెడ్డి, ఎల్లయ్య (రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్), చిలకబత్తిని కనకయ్య పాల్గొని పల్లాకిరణ్ ని ఆశీర్వదించారు.డా.రఘు, డా.సృజన్, డా.రాజు కుమార్, డా.హరికృష్ణ, గంట కిరణ్ పల్లా కిరణ్ యూత్ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.ఈ సందర్భంగా పల్లా కిరణ్ మాట్లాడుతూ, గత 20 సంవత్సరాలుగా వివిధ వర్గాల ప్రజల కోసం అనేక సేవా కార్యక్రమాలు ఉదాహరణకు సంవత్సరానికి 2 రెండు సార్లు ఉచిత మోగా వైద్య శిబిరం నిర్వహించుట, కరోనా సమయంలో 3000 మందికి మామిడికాయ పచ్చడి పంపిణీ, ప్రైవేటు టీచర్స్ మరియు పేదలకు బియ్యం, నిత్యవసర సరుకులు పంపిణీ, వరదల సమయంలో నిత్యం అందుబాటులో ఉంటూ వరద బాధితులకు ఆహారం, నీరు, నిత్యవసర సరుకులు మరియు బట్టలు పంపిణి ఇలా అన్ని వర్గాల ప్రజలకు అనేక సందర్భాల్లో అన్న దానాలు, నిరుపేద విద్యార్ధిని, విద్యార్థులకు ప్రాథమిక ఉన్నత విద్య కొరకు ఆర్ధిక సహాయం. నీటి కొరత ఉన్న ప్రాంతాలలో సొంత ఖర్చుతో బోర్లు ఏర్పాటు ట్యాంకర్ ద్వారా మంచినీటి సరఫరా. వృద్ధులకు, వికలాంగులకు, మహిళలకు, అనాధ బాలబాలికలకు యువతకు నిత్యం అనేక విధాలుగా అండగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తు అండగా ఉండడం సంతోషంగా ఉన్నదని వ్యక్తం చేశారు