ఎంపీటీసీ/ జెడ్పీటీసీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు...
విజయనగరం, సూర్య : విజయనగరం జిల్లాలో నవంబరు 5న జరిగే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ప్రశాంతియుతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ తెలిపారు.
జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ మాట్లాడుతూ..
జిల్లాలో 27 ZPTC, 438 MPTC స్థానాలకు గాను 895 లోకేషన్స్ లో 1586 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరగనున్నాయన్నారు. ఇందుకుగాను జిల్లా ఇద్దరు అదనపు ఎస్పీలు, 7గురు డీఎస్పీలు, 35మంది సిఐలు, 75మంది ఎస్సైలతోసహా సుమారు 2000మందిని బందోబస్తు నిమిత్తం వినియోగిస్తున్నామన్నారు. ఎన్నికలను శాంతియుతంగా, సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలింగ్ లోకేషన్స్ ను 196 రూట్ లగా విభజించామన్నారు. ఈ రూట్లలో ఎటువంటి అల్లర్లు జరగకుండా 56 స్ట్రైకింగ్ ఫోర్స్ లను, 27 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సు లను, జోనల్ స్ట్రైకింగ్ ఫోర్స్ లను ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ మెటీరియల్ పంపిణీ నుంచి స్ట్రాంగ్ రూమ్‌లు చేరే వరకు పూర్తి రక్షణ కల్పిస్తున్నామన్నారు. అతి సమస్యాత్మక, సమస్యాత్మక ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద డ్రోన్లు, సీసీ కెమెరాల నిఘా పెట్టామన్నారు. ఇప్పటికే రౌడీ షీటర్లతో సహా 20వేల మందిని మంచి ప్రవర్తన కోసం బైండోవరు చేసి, రూ. 2-3 లక్షల నగదు వరకు సెక్యూరిటీ బాండ్స్ తీసుకున్నామన్నారు. మద్యం, నగదు అక్రమ రవాణాపై చెక్‌పోస్టులు, ఫ్లయింగ్ స్క్వాడ్ల నిఘా పెట్టామన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఓటర్లు ప్రలోభాలకు లొంగకుండా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. అత్యవసర సమాచారం స్థానిక పోలీస్ లేదా టోల్ ఫ్రీ 100/112కు కాల్ చేయాలని జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ కోరారు.