మేయర్ జేబీ శ్రీనివాసులకు ఘన సత్కారం.. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా ఎన్నికైన జేబీ శ్రీనివాసులను తిరుపతి కో-ఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్, జనసేన పార్టీ 10, 11 డివిజన్ల ఇన్‌చార్జ్ వెంకటేష్ రాయల్ ఘనంగా సత్కరించారు.
తిరుపతి రెవెన్యూ మేజర్ న్యూస్
మేయర్ జేబీ శ్రీనివాసులకు ఘన సత్కారం..
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా ఎన్నికైన జేబీ శ్రీనివాసులను తిరుపతి కో-ఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్, జనసేన పార్టీ 10, 11 డివిజన్ల ఇన్‌చార్జ్ వెంకటేష్ రాయల్ ఘనంగా సత్కరించారు. కుటుంబ సభ్యులు, స్థానిక మహిళలు, జనసేన నాయకులతో కలిసి జేబీ శ్రీనివాసులకు శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వెంకటేష్ రాయల్ మాట్లాడుతూ, యువకుడు, ఉత్సాహవంతుడైన జేబీ శ్రీనివాసులు మేయర్‌గా ఎన్నిక కావడం తిరుపతి నగరానికి శుభపరిణామమని అన్నారు. కూటమి ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందిస్తూ, తిరుపతిని మరింత ఆధునిక స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు ఆయన సమర్థ నాయకత్వం వహిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా నగరాభివృద్ధే లక్ష్యంగా అన్ని డివిజన్ల కార్పొరేటర్లు మేయర్‌కు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆశీస్సులతో జేబీ శ్రీనివాసులు ప్రజాసేవలో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో 10, 11 డివిజన్ల జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
కె రాజేష్ రిపోర్టర్ తిరుపతి