రెండు ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు.. 10 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు 7 వేల మంది ఓటర్లు.. ఎన్నికల సామగ్రి పంపిణీకి ఏర్పాట్లు
ప్యాపిలి మేజర్ న్యూస్: ప్యాపిలి మండలంలో ఎంపీటీసీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. మండలంలో మొత్తం 21 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, 19 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన రెండు ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో మాధవరం, జక్కసానికుంట్ల ఎంపీటీసీ పరిధిలో మొత్తం 10 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మాధవరం పరిధిలో 6, జక్కసానికుంట్ల పరిధిలో 4 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పది పోలింగ్ కేంద్రాల్లో కలిపి సుమారు 7 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన ప్రిసైడింగ్ అధికారులు (PO), అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు (APO), ఇతర పోలింగ్ అధికారులకు (OPO) త్వరలోనే ఎన్నికల సామగ్రి పంపిణీ చేయనున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.