BREAKING
పేదల నివాసాల కూల్చివేతపై రాజకీయమా..! కార్తీక మాసంలో మల్లేశ్వరస్వామి ఆలయంలో విశేష పూజలు దుర్గమ్మను దర్శించుకున్న సినీ నిర్మాత దిల్ రాజు దంపతులు యువతలో నాయకత్వ లక్షణాలకు యూత్ పార్లమెంట్ పోటీలు మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు చిరస్మరణీయం : కలెక్టర్ డీకే బాలాజీ జనగణన–2027 రెండో దశను పకడ్బందీగా నిర్వహించాలి మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు నగర పోలీస్ కమిషనర్ నివాళులు ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ట్రాఫిక్‌ పోలీసుల విస్తృత తనిఖీలు ఆజాద్ ఆశయాలతో విద్యారంగ అభివృద్ధికి లోకేష్ కృషి మౌలానా ఆజాద్ సేవలు చిరస్మరణీయం చందర్లపాడు మండల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తా : ఎంపీ కేశినేని చిన్ని విజయవాడకు మరోసారి జాతీయస్థాయి స్వచ్ఛత పురస్కారం కృష్ణా జడ్పీ పీఠంపై ఉత్కంఠ! ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా హోటళ్లు, ఆహార సంస్థలు పనిచేయాలి పోరంకిలో ఘనంగా ‘మైండ్ స్పార్క్’ విజ్ఞాన ప్రదర్శన

హెల్త్‌కేర్ సామ్రాజ్యం విభజనకు సివిఎస్ ప్లాన్

Select Suryaa Now
హెల్త్‌కేర్ సామ్రాజ్యం విభజనకు సివిఎస్ ప్లాన్

సూర్య బిజినెస్ డెస్క్: అమెరికాకు చెందిన ప్రముఖ హెల్త్‌కేర్ అండ్ రిటైల్ దిగ్గజం 'సివిఎస్ హెల్త్' (CVS Health) తమ సువిశాల వ్యాపార సామ్రాజ్యాన్ని రెండు స్వతంత్ర కంపెనీలుగా విభజించాలని సంచలన నిర్ణయం తీసుకుంది. గత కొన్నేళ్లుగా చేపట్టిన విలీనాలు, కొనుగోళ్ల వ్యూహం నుంచి వెనక్కి తగ్గుతూ, వ్యాపార నిర్వహణను మరింత సరళతరం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ప్రకటించింది. సుమారు 117 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ కలిగిన ఈ కార్పొరేట్ సంస్థను రెండు ప్రత్యేక పబ్లిక్ ట్రేడెడ్ కంపెనీలుగా విభజించే ప్రక్రియ 2028 మొదటి అర్థభాగం నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ విభజన ప్రణాళిక ప్రకారం, మొదటి కంపెనీ 'హెల్త్‌కేర్ సొల్యూషన్స్' పేరుతో ఇన్సూరెన్స్ రంగంలో ప్రముఖ సంస్థ అయిన ఈట్నా (Aetna), ఫార్మసీ బెనిఫిట్స్ మేనేజర్ సీవీఎస్ కేర్‌మార్క్, స్పెషాలిటీ ఫార్మసీలతో పాటు ఇటీవల కొనుగోలు చేసిన ఓక్ స్ట్రీట్ హెల్త్, సిగ్నిఫై హెల్త్ విభాగాలను నిర్వహిస్తుంది. ఈ విభాగానికి ప్రస్తుత సివిఎస్ సీఈవో డేవిడ్ జాయ్‌నర్ నాయకత్వం వహించనున్నారు. ఇక రెండవ కంపెనీగా 'సీవీఎస్ ఫార్మసీ' పేరిట దాదాపు 9,000 రిటైల్ ఫార్మసీ స్టోర్లు, మెయిల్-ఆర్డర్ సేవల తో పాటు మినిట్ క్లినిక్, డిజిటల్ టెక్నాలజీ సేవలను వేరు చేయనున్నారు. ఈ రెండో సంస్థకు ప్రేమ్ షా సీఈవోగా వ్యవహరించనున్నారు.

గతంలో అన్ని రకాల హెల్త్‌కేర్ సేవలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలనే ఉద్దేశంతో సివిఎస్ యాజమాన్యం భారీ పెట్టుబడులు పెట్టింది. ముఖ్యంగా 2018లో ఏకంగా 78 బిలియన్ డాలర్లు వెచ్చించి ఈట్నా ఇన్సూరెన్స్ సంస్థను కొనుగోలు చేయడంతో పాటు, ఆ తర్వాత కూడా అనేక హెల్త్‌కేర్ విభాగాను విలీనం చేసుకుంది. అయితే కాలక్రమేణా రిటైల్ ఫార్మసీ వ్యాపారం మందగించడం, ఇన్సూరెన్స్ రంగంలో క్లైమ్‌ల భారం పెరగడం మరియు ఫార్మసీ ప్రయోజనాల నిర్వహణపై ప్రభుత్వ నిబంధనల ఒత్తిడి ఎక్కువ కావడంతో ఒకే సంస్థగా నిర్వహించడం సవాలుగా మారింది.

ఈ విభజన ద్వారా రెండు కంపెనీలు తమ సొంత వ్యాపార వ్యూహాలపై మరింత సమర్థవంతంగా దృష్టి సారించడానికి వెసులుబాటు కలుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రక్రియ వాటాదారులకు పన్ను రహిత లావాదేవీ ద్వారా స్టాక్ కేటాయింపులు జరిగేలా రూపకల్పన చేశారు. విస్తృత హెల్త్‌కేర్ రంగాన్ని ఒక్కటిగా మార్చాలన్న పాత వ్యూహానికి స్వస్తి పలుకుతూ సివిఎస్ తీసుకున్న ఈ నిర్ణయం అంతర్జాతీయ పారిశ్రామిక మరియు ఫార్మా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.