BREAKING
అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ అక్రిడేషన్ కార్డు చూపించినా అడ్డంకులే..! నామినేషన్ కేంద్రాల్లో పాత్రికేయులకు అవమానమా? అనుమతి నిరాకరణపై జర్నలిస్టుల ఆగ్రహం.. అధికారుల తీరుపై నిరసన చేర్యాలలో సమీకృత కార్యాలయ భవనంలో చోరీ.. రూ.4 లక్షల సామాగ్రి అపహరణ నగరం మండలంలో 26 మంది సర్పంచ్, 82 వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలు ధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. రైతుల రాస్తారోకో 365బీ జాతీయ రహదారిపై ధర్నా.. నిలిచిపోయిన వాహనాల రాకపోకలు ప్రజల అభిప్రాయం మేరకే తన అడుగులు. యువ నాయకులు గంగుల ఫణి కృష్ణారెడ్డి ఇందిరమ్మ కుటుంబ బీమాను సద్వినియోగం చేసుకోవాలి: చైర్‌పర్సన్ పావని కమ్యూనిటీ హెల్పర్స్ లో భాగంగా పోలీస్ స్టేషన్ సందర్శన ఆడబిడ్డకు అండగా సర్పంచ్ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించడం ప్రతి ఒక్కరి బాధ్యత! న్యాల్కల్ మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ప్రత్యేక శ్రద్ధ చూపాలి సిద్దిపేట జిల్లాకు ‘సురక్షిత్’ గుర్తింపు హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నివారణ, నియంత్రణలో మరో ముందడుగు గవర్నర్‌ను కలిసిన వైసీపీ బృందం.. ఎన్నికల ప్రక్రియపై ఫిర్యాదు రామకృష్ణ పై పీ డి యాక్ట్ నమోదు ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్ చోరీ..... రాష్ట్ర స్థాయి షూటింగ్ పోటీలకు ఎంపికైన న్యూ రిషి పాఠశాల విద్యార్థులు

పేద కుటుంబాలకు అండగా 'ఇందిరమ్మ జీవిత బీమా'- రంగపేటలో పథకాన్ని ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ రేవెల్లి రాజలింగం

Select Suryaa Now
పేద కుటుంబాలకు అండగా 'ఇందిరమ్మ జీవిత బీమా'- రంగపేటలో పథకాన్ని ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ రేవెల్లి రాజలింగం

సూర్య - మానకొండూర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' పథకాన్ని మానకొండూర్ మండలం రంగపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఘనంగా ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ కొత్త రాంరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మానకొండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేవెల్లి రాజలింగం హాజరై పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ రేవెల్లి రాజలింగం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. అనుకోని ఆపద సమయంలో ఆర్థికంగా ఇబ్బంది పడే నిరుపేద కుటుంబాలకు ఈ 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' ఒక భరోసాగా నిలుస్తుందని తెలిపారు. ఆయా కుటుంబాలకు ఆర్థిక ఆసరా అందించి, వారి జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని వివరించారు.ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ కాంగ్రెస్ పార్టీ పేదల పక్షపాతిగా నిలిచిందని రేవెల్లి రాజలింగం కొనియాడారు. ఆరు గ్యారెంటీలతో పాటు ఇలాంటి వినూత్న సంక్షేమ పథకాలతో నియోజకవర్గం, రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ గొప్ప అవకాశాన్ని గ్రామంలోని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ వేల్పుల కొమురయ్య, వార్డు సభ్యులు రుద్రారం లచ్చయ్య, శ్రీకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గుడాల మహేందర్ గౌడ్, నాయకులు నాగిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.