BREAKING
చింతలపూడి నగర పంచాయతీ ఓటర్ల జాబితా పంపిణీ కూటమి అభ్యర్థులను గెలిపించండి -మంత్రి పార్థసారథి మేయర్ అభ్యర్థి తో పాటు కార్పొరేటర్లందరినీ గెలిపించుకోవాలి... జంగారెడ్డిగూడెంలో వైసీపీ అభ్యర్థుల ఇంటింటా ప్రచారం, మంథనిలో ఘోర రోడ్డు ప్రమాదం - లారీ ఢీకొని యువకుడు మృతి కూటమి ధర్మాన్ని పాటించి న్యాయం చేయండి ప్రజల ఎదుర్కొన ప్రత సమస్యకు భరోసాగా నిలుస్తాం .. ఎర్రకోట రాజీవ్ రెడ్డి రూరల్ మండలంలో కూటమి విజయానికి సమష్టిగా కృషి చేయాలి: తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి రూరల్ మండల నాయకులతో కీలక భేటీ అభివృద్ధి చేశాం,మరో అవకాశం ఇవ్వండి : వైకాపా కౌన్సిలర్ అభ్యర్థులు ఎస్.ఏ.కరీముల్లా,షేక్ షబానా విజ్ఞప్తి ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి లక్ష్యం -22ఏ, టీడీఆర్ బాండ్ల సమస్యకు 100 శాతం పరిష్కారం చూపిస్తాం -1000 మంది ఓటర్ల ఆత్మీయ సమావేశంలో 52వ డివిజన్ ఎన్డీఏ కూటమి కార్పొరేటర్ అభ్యర్థి గుడిపల్లి పృథ్వి హామీ ఈరోజు మా తాడేపల్లిగూడెం కి ఏనుగు వచ్చిందని మీకు తెలుసా జడ్పీ చైర్మన్ కాంగ్రెస్ అభ్యర్థి గా ప్రియాంక ఇంజనీర్ కౌన్సిలరైన వేళ. భీమవరంలో నారాయణ స్కాలర్‌షిప్ పరీక్షను అడ్డుకున్న ఎస్‌ఎఫ్‌ఐ ఇతర విద్యాసంస్థల విద్యార్థులను ప్రలోభపెట్టి అడ్మిషన్లు కల్పించే ప్రయత్నాలను సహించం భీమవరం, మేజర్ న్యూస్: భీమవరం పట్టణంలోని గునుపూడి ప్రాంతంలో నారాయణ విద్యాసంస్థలు నిర్వహిస్తున్న ఎన్‌సెట్ స్కాలర్‌షిప్ పరీక్షను ఎస్‌ఎఫ్‌ఐ (స్టూడెంట్స్ ఫెడరేషన కూరగాయల సాగుతో రైతులకు అధిక ఆదాయం పంట మార్పిడిని ప్రోత్సహిస్తున్న  ప్రభుత్వం *ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

రణరంగాన్ని తలపించిన పటాన్‌చెరు -కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌ పోటాపోటీ ధర్నాలు

Select Suryaa Now
రణరంగాన్ని తలపించిన పటాన్‌చెరు -కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌ పోటాపోటీ ధర్నాలు

రణరంగాన్ని తలపించిన పటాన్‌చెరు
-కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌ పోటాపోటీ ధర్నాలు
-స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్‌.. 
-మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలంటూ బీఆర్‌ఎస్‌
-మధ్యలో పాలిటెక్నిక్‌ విద్యార్థుల మెరుపు ధర్నా.. -పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన ఉద్రిక్తత

పటాన్‌చెరు,….పటాన్‌చెరు అంబేద్కర్‌ సర్కిల్‌ మంగళవారం ఆందోళనలతో అట్టుడికింది. ఒకవైపు కాంగ్రెస్‌, మరోవైపు బీఆర్‌ఎస్‌ నాయకులు పోటాపోటీగా ధర్నాలు, ర్యాలీలు నిర్వహించగా.. ఇదే సమయంలో పాలిటెక్నిక్‌ విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ మెరుపు ధర్నాకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరువర్గాల నినాదాలతో కొద్దిసేపు అంబేద్కర్‌ సర్కిల్‌ పరిసరాలు హోరెత్తాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

కేసీఆర్‌ దళిత ద్రోహి: కాంగ్రెస్‌

అసెంబ్లీలో స్పీకర్‌పై బీఆర్‌ఎస్‌ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్‌ నాయకులు నిరసన చేపట్టారు. గాంధీ పార్క్‌ నుంచి అంబేద్కర్‌ సర్కిల్‌ వరకు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. కేసీఆర్‌ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్‌ నాయకులు కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన కొనసాగించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడుతూ.. కేసీఆర్‌ దళితులను అవమానించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో స్పీకర్‌ పదవికి ఉన్న గౌరవాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. స్పీకర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలి: బీఆర్‌ఎస్‌

మరోవైపు అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలపై కాంగ్రెస్‌ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్‌ఎస్‌ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా ఎమ్మెల్యేలకు కాంగ్రెస్‌ నేతలు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తూ నిరసన చేపట్టారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు.

విద్యార్థుల ధర్నాతో మరింత ఉద్రిక్తత

ఇదే సమయంలో తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పాలిటెక్నిక్‌ విద్యార్థులు కూడా అంబేద్కర్‌ సర్కిల్‌కు చేరుకుని మెరుపు ధర్నా చేపట్టారు. దీంతో ఇప్పటికే కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఆందోళనలతో ఉద్రిక్తంగా ఉన్న ప్రాంతంలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇరువర్గాల నినాదాలతో పాటు విద్యార్థుల ఆందోళనతో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది.పాలిటెక్నిక్‌ విద్యార్థులు ధర్నా.. విరమించకపోవడంతో పోలీసులు వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించి సమస్యపై సర్దిచెప్పారు. అనంతరం విద్యార్థులు ఆందోళన విరమించడంతో పరిస్థితి క్రమంగా సద్దుమణిగింది. పోలీసులు సమన్వయంతో వ్యవహరించడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పరిస్థితి అదుపులోకి వచ్చింది.