జంగారెడ్డిగూడెంలో వైసీపీ అభ్యర్థుల ఇంటింటా ప్రచారం,
జంగారెడ్డిగూడెం-మేజర్ న్యూస్, జంగారెడ్డిగూడెం మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ మచిలీపట్నం పార్లమెంటు పరిశీలకులు జెట్టి గురునాథరావు నాయకత్వంలో ఆదివారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి మేక సత్యవతితో పాటు ఆయా వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులు ప్రజలను కలుసుకుని పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు.పట్టణంలోని ఊరచెరువు, సౌభాగ్య థియేటర్ వెనుక ప్రాంతం, లక్ష్మీ హాస్పిటల్ రోడ్డు, వాసవి నగర్, ప్రతిభ స్కూల్ రోడ్డు, సుబ్బారెడ్డి కాలనీ తదితర ప్రాంతాల్లో ప్రచారం సాగింది. ఈ సందర్భంగా ఫ్యాను గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని నాయకులు ఓటర్లను కోరారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అభ్యర్థులు తాడేపల్లి ఉమా, చిన్ని సౌందర్య, కర్పూరం ప్రవళికతో పాటు పార్టీ నాయకులు బీవీఆర్ చౌదరి, కర్పూరం గవరయ్య గుప్తా, జెట్టి సత్య ఆదిత్య, ముప్పిడి శ్రీనివాసరావు, కుక్కల ధర్మరాజు, చింత అనిల్, చీమకుర్తి శ్రీనివాసరావు, వందనపు వెంకటేశ్వరరావు, చిత్తపురి శేఖర్, చిట్లూరి సర్వేశ్వరరావు, కర్పూరం ప్రసాద్, తడికమళ్ల మురళి, మేక సింహాద్రి, కాసర్ బన్నీరెడ్డి, కంచర్ల విష్ణు, మేక బాలు, గోపి, కత్తి వసంతు, కోనపాము వెంకట్, అబ్బాస్, షరీఫ్, గగ్గల కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.