మేయర్ అభ్యర్థి తో పాటు కార్పొరేటర్లందరినీ గెలిపించుకోవాలి...
తిరుపతి, అక్టోబర్ 25 :
తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలలో టిడిపి కూటమి అభ్యర్థి జేబీ శ్రీనివాస్ తో పాటు కార్పొరేటర్ అభ్యర్థులందరినీ గెలిపించుకోవాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. ఆదివారం నగరంలోని ఒక కళ్యాణ మండపంలో బలిజ సోదరుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు, చైర్మన్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, బలిజ సంఘం రాష్ట్ర నేత ఊకా విజయ్ కుమార్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తిరుపతి కార్పొరేషన్ పరిధిలో 16 మంది కార్పొరేటర్ అభ్యర్థులుగా బలిజ కులస్తులు పోటీ పడుతున్నారని
వారందరినీ మనమంతా ఐక్యమై గెలిపించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మనలో ఉన్నా విభేదాలను పక్కనపెట్టి మేయర్ అభ్యర్థి జెబీ శ్రీనివాస్ తో పాటు కార్పొరేటర్ అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి, మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ రెండున్నర సంవత్సరాల కూటమి ప్రభుత్వంలో తిరుపతి నియోజకవర్గంలో అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందని, తాను కార్పొరేషన్ మేయర్ అయిన వెంటనే అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో దండ నాగభూషణం, కటిక మునిరాజా, నగరంలోని బలిజ సంఘం ప్రతినిధులు హాజరయ్యారు.
విజయ, మునిశేఖర్ రాయల్ దంపతులకు సన్మానం....
నగరంలోని 46 డివిజన్ టిడిపి కార్పొరేటర్ గా ఏకగ్రీవం అయినా పి. విజయ, మునిశేఖర్ రాయల్ దంపతులను ఆత్మీయ బలిజ సోదరుల సమావేశంలో ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, మేర అభ్యర్థి జేబీ శ్రీనివాస్ లు శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. మునిశేఖర్ రాయల్ 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఉంటూ పార్టీ పటిష్టత కోసం తన వంతుగా శక్తివంచన లేకుండా పనిచేస్తూ వస్తున్నారు. స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ కు విధేయుడుగా ఉంటూ వెన్నంటే ఉండేవారు. ఆయన మరణానంతరం మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ వెంట నడుస్తూ వచ్చారు. గతం లో ఆమె ఎమ్మెల్యేగా విజయం సాధించడంలో మునిశేఖర్ రాయల్ కీలకం పాత్ర పోషించారు. తన డివిజన్ ఏకగ్రీవమైనప్పటికీ మిగిలిన మేయర్ అభ్యర్థితో పాటు కార్పొరేటర్ల అభ్యర్థుల గెలుపు కోసం అన్ని డివిజన్లలో పర్యటిస్తూ ప్రచారం చేపట్టారు.
H. Dwaraka, staff reporter.
9705347341.