BREAKING
క్యాన్సర్ చికిత్సలో కీలక మైలురాయి...ఆస్ట్రాజెనెకా స్టమక్ క్యాన్సర్ ఔషధానికి సఫలత విధులు నిర్వహిస్తున్న ప్రవళికపై దాడి వారిని పై హత్యానేరం క్రింద కేసు బుక్ చేయాలి :టి జెఎమ్‌యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ రాష్ట్రాల ఎన్నికలను స్వాధీనం చేసుకునే ఉద్దేశం ట్రంప్‌కు లేదు మునిగిపోతున్న నౌక-40 మంది ఇరాన్ నావికులను రక్షించిన ఎస్ఎల్ నేవీ 32వ డివిజన్ ను అన్ని విధాలుగా అభివృద్ది చేయడమే లక్ష్యం.. టిడిపి కార్పొరేటర్ అభ్యర్థి బట్టే వెంకట కీర్తి... వెనిజులాకు తిరిగి వచ్చిన ప్రముఖ ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అలయ్ బలయ్ డిక్లరేషన్ ఫామ్స్ ఇచ్చిన ఎమ్మెల్యే ఎరపతినేని ఇటలీ లీగ్ పార్టీ నేతగా మళ్లీ ఎన్నికైన మట్టేయో సాల్విని భారత్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో పద్మభూషణ్ వెంపటి చిన్న సత్యం జయంతి వేడుకలు కూటమి చైర్మన్ అభ్యర్థి శ్రీరామ్ చినబాబుకి బ్రహ్మరథం : 28వ వార్డులో జన ప్రభంజనం మధ్య ఎన్నికల ప్రచారం : పచ్చిపాల రామకృష్ణ ఆచారి,తులసి దంపతులు ఆత్మీయ స్వాగతం అశాంతిని అరికట్టేందుకు కొత్త నిబంధనలు ఉన్నప్పటికీ తిరానాలో చెలరేగిన నిరసనలు గిన్నిస్‌ ప్రపంచ రికార్డులతో గీతం పూర్వ విద్యార్థిని చరిత్ర వాసవి క్లబ్ సేవలు అభినందనీయం - ఉప్పల శ్రీనివాస్ గుప్తా అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా.... 39 వ డివిజన్ జనసేన కార్పొరేటర్ అభ్యర్థి పింకీ జైన్

కూటమి అభ్యర్థులను గెలిపించండి -మంత్రి పార్థసారథి

Select Suryaa Now
కూటమి అభ్యర్థులను గెలిపించండి   -మంత్రి పార్థసారథి

నూజివీడు, మేజర్ న్యూస్ : అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికలలో  ఓటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి పిలుపు నిచ్చారు. ఆదివారం 15, 16వ వార్డుల్లో విస్తృతంగా పర్యటించి ముఖ్య నాయకులు, కార్యకర్తలతో మంత్రి కొలుసు పార్థసారథి సమావేశాన్ని నిర్వహించారు.  అనంతరం ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించి, తమ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.  ఈ సందర్భంగా పలు సమస్యలను ఆయా వార్డు ప్రజలు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన మంత్రి పార్థసారథి స్పందించిన దశలు వారీగా అన్ని పనులు పూర్తిచేస్తామని  హామీఇచ్చారు. ఎన్నికలు అవ్వగానే ఇంటి స్థలాలు కోసం ధరఖాస్తులు పెట్టుకున్న వారికి 100 మందికి ఇండ్లపట్టాలు అందజేస్తామని, ఒక కమ్యూనిటీ హాలు, ఒక ట్రాన్స్ఫార్మరు ఏర్పాటు చేస్తామన్నారు. స్వర్ణవార్డు సచివాలయానికి అదనంగా ప్రజలకు ఉపయోగపడేలా ఒక హాలు నిర్మాణానికి 200 సిమెంటు రాళ్లు, ఒక ట్రంకు ఇసుకను అందిస్తామని అన్నారు.ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి ​మాట్లాడుతూ పట్టణ సమగ్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేశామని అన్నారు. పట్టణంలో త్రాగునీరు, సీసీ రోడ్డులు, డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్లు, పార్కులు, కమ్యూనిటీ హాలు, తదితర పనులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. స్థానిక సంస్థల్లో కూటమి అభ్యర్థులు గెలిస్తేనే అభివృద్ధి పనులు మరింత వేగవంతంగా సాగుతాయని, పార్టీలు కార్యకర్తలు, నేతలు విభేదాలు లేకుండా సమన్వయంతో ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వం చేస్తున్న మంచిని వివరించాలని తెలిపారు. కూటమి అభ్యర్థులు తిరుగులేని మెజార్టీ సాధించేలా ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచెయ్యాలని కోరారు. ​ఈ కార్యక్రమంలో చైర్మన్ అభ్యర్థి బర్రె ఇళయరాజా, పోటీలో ఉన్న అధికారిక అభ్యర్థులు,కూటమి పార్టీనాయకులు, వార్డు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వార్డు ప్రజలు, మహిళలు  పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 రిపోర్టర్ టీవీఎస్ ప్రసాద్ నూజివీడు ఏలూరు జిల్లా,