సూర్య మంథని: మంథని మండలంలోని మల్లేపల్లి గ్రామానికి చెందిన చింతల నవీన్ అనే యువకుడు పాత పెట్రోల్ బంకు సమీపంలో ఆదివారం లారీ ఢీకొని మృతి చెందాడు.మృతుడు నవీన్ పాత పెట్రోల్ బంకు సమీపంలోనీ పండ్ల దుకాణంలో పనిచేస్తున్నాడు.దాహం వేయడంతో రోడ్డుకు ఆవలి వైపు ఉన్న స్వీట్ హౌస్ లో నీళ్ళు తాగి తిరిగి పండ్ల దుకాణంకు వెళ్తుండగా వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలై నవీన్ అక్కడికి అక్కడే మృతి చెందాడు.మృతుని కుటుంబ సభ్యులు బోరుబోరుమని ఏడ్చి మృతుడి కుటుంబ సభ్యులు ఘటన జరిగిన స్థలం సమీపంలోనే చాలా సేపటి దాకా ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా మంథని ఎస్ ఐ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.