నిరుపేద ఇంటి నిర్మాణానికి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ సహాకారం*
తలకొండపల్లి, రంగారెడ్డి :
మండల పరిధిలోని మెదక్ పల్లి గ్రామానికి చెందిన శానమోని మహేష్ రాజ్ తండ్రి కృష్ణయ్య ఇంటి నిర్మాణం కొరకు అవసరమైన సిమెంట్ రాష్ట్ర నాయకులు, మాజీ మిషన్ భగీరథ వైస్ చైర్మన్, తలకొండపల్లి మాజీ జెడ్పిటిసి, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ అందించడం జరిగింది. ఈ సందర్భంగా శానమోని మహేష్ రాజ్ తండ్రి కృష్ణయ్య వారి కుటుంబ సభ్యులు వెంకటేష్ కు శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ నరేష్ రాజ్, వార్డ్ మెంబర్ దరువుల రజనీకాంత్, BRS మాజీ గ్రామ అధ్యక్షులు మార్చమల్లయ్య,BRS యువ నాయకులు బతికే బాలు, కటికం సతీష్, శానమోని నాని తదితరులు పాల్గొన్నారు.
- చప్పిడి తిరుపతి, మేజర్ న్యూస్.