BREAKING
జడ్పీటీసీ బండి జగదీశ్ రెడ్డి కి సత్కారం వైయస్‌ఆర్‌సీపీ అనంతపురం నగర మేయర్ రమేష్ గౌడ్ హౌస్ అరెస్ట్ యాదమరిలో తెలుగుదేశం పార్టీ హవా... మాదిరెడ్డిపల్లి ఎంపీటీసీగా జే లావణ్య విజయం.. తాళాయికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలి.… ధాన్యం కొనుగోళ్లపై ఎమ్మెల్యేఎమ్మెల్యే జోక్యం.. రైతులకు భరోసా! వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి హౌస్ అరెస్ట్* స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ పలమనేరు మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ భర్త సంచలన ప్రకటన రేపు వైరాలో విద్యార్థులకు నియోజకవర్గ స్థాయి ఎన్నికల అక్షరాస్యత పోటీలు.. ఫస్ట్ లవ్’ షార్ట్ ఫిలిం పోస్టర్‌ను ఆవిష్కరించిన జడ్పిటిసి శైలజా తేజ మూర్తి ఘనంగా జాతీయ న్యాయ సేవా దినోత్సవం చెరువుగట్టు క్షేత్రం సుభిక్షంగా ఉండాలి గ్రామాభివృద్ధికి సహకరించాలి... రైలు ప్రమాదంలో నర్సింగాపూర్ వ్యక్తికి తీవ్ర గాయాలు.. వీణవంక సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్‌నకు రెండో త్రైమాసికంలో 7 బిలియన్ డాలర్ల నికర నష్టం

ముగియనున్న సీఎం పర్యటన: నేడు కొడంగల్‌లో రూ.9,053 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Select Suryaa Now
ముగియనున్న సీఎం పర్యటన: నేడు కొడంగల్‌లో రూ.9,053 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

వికారాబాద్, సూర్య బ్యూరో :తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గ పర్యటన మూడో రోజుకు చేరుకుంది. పర్యటనలో భాగంగా ఈరోజు (ఆదివారం) సాయంత్రం 4:30 గంటలకు లగచర్ల ఇండస్ట్రియల్ కారిడార్ వేదికగా నిర్వహించనున్న భారీ రైతు బహిరంగ సభలో సీఎం పాల్గొననున్నారు.

ఈ సందర్భంగా నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ఊతమిచ్చేలా దాదాపు రూ.9,053 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు కీలక సంక్షేమ, అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు చేయనున్నారు. లగచర్లలో రూ.81 కోట్లతో ఎకో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం, నాచారం గ్రామం నుంచి రేడియల్ రోడ్డు సహా పలు రహదారుల పనులకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. ఈ బహిరంగ సభకు మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల నుంచి భారీగా రైతులు తరలిరానుండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.