BREAKING
న్యాయవాది అశ్వినికి గ్రామస్తుల ఘన సన్మానం శ్రీకాకుళం జిల్లాకు కనీసం రూ.100 కోట్ల నిధులు కూడా తీసుకురాలేనీ ప్రభుత్వం:మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అవినీతి లేని పాలన అందిస్తా.. అభివృద్ధికి అంకితమవుతా...! సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించాలని బొమ్మన రవీంద్రనాథ్ రెడ్డి పట్టణ ప్రజలకు విజ్ఞప్తి..... మంత్రతంత్రాల పేరుతో రూ.లక్షల్లో టోకరా - అంతర్రాష్ట్ర ముఠాలో ఐదుగురి అరెస్టు షీలానగర్లో గుర్తుతెలియని మృతదేహం లభ్యం కదిరి మున్సిపల్ చైర్ పర్సన్ అర్షియా భాను ప్రమాణ స్వీకారం నూతన మున్సిపల్ చైర్మన్ నల్లా శ్రీధర్‌కు బొలిశెట్టి సత్య అభినందనలు.... థాయ్‌లాండ్‌లో ప్రతిపక్ష ఎంపీకి భారీ ఊరట దక్షిణ కొరియా కేబినెట్‌లో కీలక మార్పులు ఉక్రెయిన్‌లోని కీవ్ ప్రాంతంలో రష్యా భీకర దాడి మున్సిపాలిటీ వైస్ చైర్మన్‌గా వాసంశెట్టి వెంకటరమణారావు ఢిల్లీ వైపు సాగుతున్న భారత్-శ్రీలంక సైక్లింగ్ యాత్ర శ్రీ సత్య సాయి బాబా మహా సమాధిని దర్శించుకున్న కేంద్ర మంత్రి ఐక్యతతో పోరాడితేనే హార్డ్వేర్ పార్క్ భూ సమస్యకు పరిష్కారం జెలెన్స్కీపై రష్యా హత్యాయత్న కుట్రను భగ్నం చేసిన పోలాండ్ నిఘా వర్గాలు...

మంత్రి సీతక్క సమీక్షా సమావేశానికి  పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి

Select Suryaa Now
మంత్రి సీతక్క సమీక్షా సమావేశానికి  పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి
 అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ 
సూర్య కామారెడ్డి జిల్లా ప్రతినిధి:  పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ఉమ్మడి నిజామాబాద్ కరీంనగర్ అదిలాబాద్ జిల్లాలకు చెందిన అధికారులతో కామారెడ్డి వేదికగా ఈనెల 28న నిర్వహించనున్న సమీక్షా సమావేశానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ జిల్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన అధికారులతో ఆయా జిల్లాల అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి సీతక్క కామారెడ్డి వేదికగా సమీక్ష సమావేశం నిర్వహించనున్నారని తెలిపారు. 
ఈ సమీక్షా సమావేశానికి అవసరమైన ఇతర ఏర్పాట్లను ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి సమీక్షా సమావేశానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేసి, ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా చర్యలు చేపట్టాలన్నారు. శాఖల వారీగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, వాటి పురోగతి, పెండింగ్ అంశాలు, సాధించిన లక్ష్యాలు తదితర వివరాలతో సమగ్ర నివేదికలను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు.
 మంత్రి పర్యటన నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని రూమ్ నంబర్ 25కు మార్చినట్లు అధికారులు తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరి, జెడ్పీ సీఈఓ చందర్, డీఆర్‌డీఓ దామోదర్ రెడ్డి, డీఆర్ఓ పాండు, ఏఓ మసూద్ హైమద్, పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.