BREAKING
రేపు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్‌లు, ఆర్డీవో, ఎమ్మార్వో కార్యాలయాల ముట్టడిః ఎంపీ, ఆర్. కృష్ణయ్య పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ అండ. చెత్తకుప్పల్లో బ్యాలెట్లు.. ఎన్నికల వ్యవస్థకే సిగ్గుచేటు మిట్టపాలెం గ్రామంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ & జోనల్ కో-ఆర్డినేటర్ శ్రీ దామచర్ల సత్య ఎన్నికల విధులకు జూనియర్ అసిస్టెంట్ గైర్హాజరు.. అధికారుల ఉదాసీనతపై విమర్శలు! ఏషియన్-ఇండియా మారిటైం కాంక్లేవ్ లో విద్య‌, ఐటీ శాఖ‌ల మంత్రి లోకేష్ ‎‎ప్రజల సంపదను ప్రజలకే పంచుతున్న ప్రజా ప్రభుత్వంః ‎‎డిప్యూటీ సీఎం భట్టి నూతన మున్సిపల్ చైర్మన్ శ్రీధర్ తొలి సంతకం.... తడగొండలో ఆగ్రో సబ్ సెంటర్ ప్రారంభం.. చైర్మన్ హోదాలోనూ.. చెక్కుచెదరని మాతృప్రేమ* 37వ డివిజన్ కార్పొరేటర్ గా అనురాధ ప్రమాణ స్వీకారం ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో 15 మంది ఉద్యోగులకు టీఎన్జీవో సభ్యత్వం సీఎం సహాయనిధి అందజేత ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలిః మంత్రి వాకిటి శ్రీహరి వెల్దుర్తి ఎంపీడీవో కార్యాలయంలో ఎల్. నగరం వార్డ్ నెంబర్ 5 నామినేషన్ దాఖలు

మంగువాయిబాడవ గ్రామంలో అట్టహాసంగా ఎంగిల పూల బతుకమ్మ సంబరాలు.

Select Suryaa Now
మంగువాయిబాడవ గ్రామంలో అట్టహాసంగా ఎంగిల పూల బతుకమ్మ సంబరాలు.

మంగువాయిబాడవ గ్రామంలో అట్టహాసంగా ఎంగిల పూల బతుకమ్మ సంబరాలు.

(దుమ్ముగూడెం, సూర్య మేజర్ న్యూస్)::
మండల పరిధిలోని మంగువాయిబాడవ గ్రామంలో తెలంగాణ సాంస్కృతిక ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను స్థానిక సర్పంచ్ జయరావు శనివారం ఘనంగా ప్రారంభించారు.పండుగ మొదటి రోజైన ఎంగిల పూల బతుకమ్మను పురస్కరించుకుని గ్రామ మహిళలంతా ఒక్కచోట చేరి ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు.రంగురంగుల పూలతో ఎంతో సుందరంగా బతుకమ్మలను తీర్చిదిద్ది గ్రామ వీధుల్లో మహిళలు,యువతులు భక్తిశ్రద్ధలతో ప్రదక్షిణలు చేశారు. గౌరమ్మను కొలుస్తూ బతుకమ్మ పాటలకు లయబద్ధంగా చప్పట్లు కొడుతూ ఆడిపాడారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ తునికి జయరావు,గ్రామ పటేల్ కల్లూరి వెంకటేశ్వరరావు,రాము,మహిళలు కల్లూరి బాయమ్మ, మరియమ్మ, సమ్మక్క, మమత, లక్ష్మి, ఆదిలక్ష్మి, విజయశ్రీ,కావేరి, నాగమణి, సుభద్ర, భద్రమ్మ పాల్గొన్నారు.

దుమ్ముగూడెం సూర్య రిపోర్టర్.. సుమన్