BREAKING
సంగారెడ్డిలో దసరా వేడుకలకు భారీ ఏర్పాట్లు సిద్దిపేటకు యూనివర్సిటీనే నెక్స్ట్ టార్గెట్..! 16వ వార్డులో టీడీపీ, జనసేన అభ్యర్థులను గెలిపించాలి భవాని మాత యూత్ అసోసియేషన్‌కు ఐదేళ్లుగా చేవెళ్ల మహి చేయూత.. కాసుల మహేందర్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపిన BMYA భారతీనగర్ డివిజన్‌లో ఘనంగా దసరా వేడుకలు ఉయ్యూరు మునిసిపల్ చైర్మన్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్‌ను గెలిపించాలి రాజరాజేశ్వరి దేవిక దర్శనమిచ్చిన గ్రామ దేవత శ్రీ పైడమ్మ అమ్మవారు శిక్షణ కార్యక్రమాలు 85వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి గెలుపునకు బొండా ఉమా ప్రచారం హింసాత్మక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు. ఖమ్మంలో జమ్మిబండపై ప్రత్యక్షమైన స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ సత్తుపల్లిలో ఆధునిక వైద్య సేవలకు మరో ముందడుగు.. ‘శస్త్ర హాస్పిటల్’ ప్రారంభం*మంత్రి తుమ్మల ఎమ్మెల్యేమట్టా రాగమయి దయానంద్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం మండల పరిధి పుల్లపాడు MPTC అభ్యర్థిగా మురాల ఫణికుమార్ వైసీపీకి షాక్ - టీడీపీలో చేరిన మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ స్వగ్రామంలో సీఎం రేవంత్‌రెడ్డి దసరా వేడుకలు: కోట మైసమ్మ అమ్మవారికి, జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు

మెట్లకుంటలో దుర్గామాత చీర రూ.30 వేలకు వేలం.. దక్కించుకున్న చౌదర్పల్లి గోపాల్–అనిత దంపతులు

Select Suryaa Now
మెట్లకుంటలో దుర్గామాత చీర రూ.30 వేలకు వేలం.. దక్కించుకున్న చౌదర్పల్లి గోపాల్–అనిత దంపతులు

బొంరాస్‌పేట్, మేజర్ న్యూస్ : బొంరాస్‌పేట్ మండలం మెట్లకుంట గ్రామంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. నవరాత్రుల తొమ్మిదో రోజు మహిషాసుర మర్దిని అవతారంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులు విశేష పూజలు నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు నిత్య పూజలతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి అలంకరించిన చీరను వేలం వేయగా భక్తులు పోటాపోటీగా పాల్గొన్నారు. ఈ వేలంపాటలో గ్రామానికి చెందిన చౌదర్పల్లి గోపాల్–అనిత దంపతులు అత్యధికంగా రూ.30 వేలు చెల్లించి అమ్మవారి చీరను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా గోపాల్ దంపతుల కుటుంబ సభ్యులు విష్ణువర్ధన్, కృష్ణ సంతోషం వ్యక్తం చేశారు. అమ్మవారి ఆశీస్సులు తమ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో నవరాత్రి ఉత్సవాలు పండుగ వాతావరణంలో కొనసాగాయి.

రిపోర్టర్: శ్రీశైలం, బొంరాస్ పేట్, వికారాబాద్ జిల్లా.