మాజీ మంత్రి పువ్వాడ దసరా వేడుకలు
సూర్య ఖమ్మంమాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కుటుంబ సమేతంగా మంగళవారం నాడు దసరా వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.
హైదరాబాద్ లోని బాచుపల్లి మమత ఆసుపత్రిలో వేద పండితుల సమక్షంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సాంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించారు. అనంతరం ఆసుపత్రిలో 3 టెస్లా (3T) ఎంఆర్ఐ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సతీమణి వసంతలక్ష్మి, కుమారుడు నయన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్ పసుపులేటి సత్యనారాయణ