BREAKING
కార్తీక పౌర్ణమి సందర్భంగా నవ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేష పూజలు ఢిల్లీలో కాలుష్యం తీవ్రత దృష్ట్యా ఎయిర్ ప్యూరిఫయర్లకు ఐదు రెట్లు పెరిగిన డిమాండ్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చేతుల మీదుగా నూతన పెన్షన్ పత్రాల పంపిణీ భారతీయ సంస్కృతి, సామాజిక సమైక్యతకు ఛత్‌ పూజ ప్రతీక: ఎంపీ ఈటల రాజేందర్ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే 80 శాతం ఉద్యోగాలు కల్పించాలి దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడి: హమాస్ కమాండర్ హతం ఎస్సై ఓం ప్రకాష్ కు ఘన సన్మానం బొంతు గీతకు రెడ్డి శాంతి సన్మానం మత్స్యకారులకు నిత్యవసర వస్తువులు పంపిణీ ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను మర్యాదపూర్వకంగా కలిసిన గొల్ల నరసింహ యాదవ్ సోదరులకు ఘన సన్మానం. మల్లూరు గుట్టకు మహిళల పాదయాత్ర నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీలకు ఘన సత్కారం.. ఎన్నికల నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన డిపిఓ. ఎంపీడీవో డిప్యూటీ ఎంపీడీవో సాలూరు రైలు బండిని పునరుద్ధరించండి

మల్లన్నసాగర్‌ భూ నిర్వాసితుల సమస్యలపై సీఎం స్పష్టమైన ప్రకటన చేయాలి

Select Suryaa Now
మల్లన్నసాగర్‌ భూ నిర్వాసితుల సమస్యలపై సీఎం స్పష్టమైన ప్రకటన చేయాలి

గజ్వేల్ ; .ఈ నెల 19న సిద్దిపేట జిల్లా పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మల్లన్నసాగర్‌ భూనిర్వాసితుల దీర్ఘకాలిక సమస్యలపై స్పందించి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు, భూనిర్వాసితుడు కీసరి నరేష్‌ గౌడ్‌ డిమాండ్‌ చేశారు. శనివారం ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీ పల్లెపహాడ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రాజెక్టు నిర్మాణం కోసం విలువైన భూములు, ఆస్తులను త్యాగం చేసిన నిర్వాసితులు నేటికీ అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నిర్వాసితులకు 20 ఏళ్లపాటు మున్సిపల్‌ పన్నుల నుంచి మినహాయింపు కల్పించాలని కోరారు. సొంతంగా ఇళ్లు నిర్మించుకునేందుకు పూర్తి స్థాయి మున్సిపల్‌ అనుమతులు జారీ చేయడంతోపాటు ఇందిరమ్మ ఇళ్ల వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన నిర్వాసితులకు వర్తింపజేయాలని సూచించారు. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద రావాల్సిన పెండింగ్‌ చెక్కులు, ఇళ్ల నిర్మాణాల విలువకు సంబంధించిన పరిహారం, బై నంబర్‌ చెక్కులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఇళ్లు, ప్లాట్లు కేటాయించిన వారికి రిజిస్ట్రేషన్‌ పత్రాలు అందించాలని కోరారు. 18 ఏళ్లు నిండిన యువతకు రావాల్సిన పెండింగ్‌ ప్యాకేజీ చెక్కులు విడుదల చేయడంతోపాటు ప్లాట్ల రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలని, అర్హులను గుర్తించేందుకు ప్రత్యేక సర్వే నిర్వహించాలని పేర్కొన్నారు. ప్యాకేజీలు అందని ఒంటరి మహిళలను గుర్తించి వారికి రావాల్సిన పరిహారం చెల్లించడంతోపాటు ప్లాట్లు, ఇళ్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీల్లో డ్రైనేజీ, లేఅవుట్‌, విద్యుత్‌ సమస్యలను పరిష్కరించి మౌలిక వసతులు కల్పించాలని కోరారు. వైకుంఠధామం, వైకుంఠ రథం ఏర్పాటు చేయడంతోపాటు ప్రతి గ్రామానికి ఒక బస్తీ దవాఖానా నెలకొల్పాలని సూచించారు. కాలనీల్లో గ్రామదేవతల ఆలయాలు, కుల సంఘాల దేవాలయాలు, కమిటీ హాళ్లు, మున్సిపల్‌ కార్యాలయం ఏర్పాటు చేయాలని తెలిపారు. బొడ్రాయి వంటి గ్రామదేవతల పండుగల నిర్వహణకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. ప్రాజెక్టులో భూములు కోల్పోయిన ప్రతి నిర్వాసితుడికి ప్రత్యేక లైసెన్స్‌ అనుమతులు మంజూరు చేయాలని, కులవృత్తుల నిర్వహణకు, ఈత చెట్ల పెంపకానికి అవసరమైన స్థలాలు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. నిర్వాసిత యువతకు ప్రభుత్వ పథకాల్లో మొదటి ప్రాధాన్యత కల్పించాలని, స్థానికంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు, ఆస్తులు త్యాగం చేసిన నిర్వాసితుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఇకనైనా చొరవ చూపాలని కీసరి నరేష్‌ గౌడ్‌ కోరారు. ఈ నెల 19న సిద్దిపేటలో నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యమంత్రి నిర్వాసితుల సమస్యలపై స్పందించి, పరిష్కారానికి స్పష్టమైన హామీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.