సూర్య గన్నేరువరం : మహిళా స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయాలన్న సంకల్పంతోనే రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగిస్తోందని మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు.గురువారం గన్నేరువరం మండలంలోని గోపాలపూర్, హన్మాజీపల్లి, జంగపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వావలంబనకు పెద్దపీట వేస్తోందన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పారదర్శకతకు ప్రాధాన్యత ఉంటుందని, తూకాల్లో మోసాలకు, ఇతర అవకతవకలకు ఆస్కారం ఉండదని పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మహిళా సంఘాలు కొనుగోలు కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రైతులకు అండగా నిలుస్తూ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాల ద్వారా అవసరమైన సహకారం అందిస్తోందన్నారు. రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. రైతులు దళారుల మాయమాటలకు మోసపోకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు.ఈ కార్యక్రమాల్లో బెజ్జంకి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ మాతంగి శిరీష-అనిల్, మాజీ చైర్మన్ పులి కృష్ణ, బెజ్జంకి ప్యాక్స్ చైర్మన్ ఒగ్గు దామోదర్, నుస్తులాపూర్ ప్యాక్స్ చైర్మన్ మోరపల్లి రమణారెడ్డి, మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బొడ్డు సునీల్, డైరెక్టర్లు జిల్లా రాజేశ్వరి, దేశరాజు అనిల్, నందికొండ తిరుపతిరెడ్డి, మైసంపల్లి తిరుపతి, ఇస్కిల్ల ఐలయ్య, జీల లింగం, రెడ్డి రామకృష్ణారెడ్డి, మహమ్మద్ సాదిక్, కుంట హరికృష్ణ, ఎలకంటి శ్రీనివాస్, అనంతరెడ్డి, ముస్కు ఉపేందర్ రెడ్డి, ముక్కిస రత్నాకర్ రెడ్డి, అయిలయ్య, కొమ్మెర రవీందర్ రెడ్డి, కట్కం తిరుపతి, బుర్ర తిరుపతి గౌడ్, జెల్ల ప్రభాకర్, చింతల శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.