BREAKING
సిద్దిపేట డిపో మేనేజర్‌పై చర్యలు తీసుకోవాలి - టీఎంయూ రాష్ట్ర నాయకుల డిమాండ్ ఆళ్లగడ్డ మండలంలో కూటమి ప్రభంజనం ఐవీవై పాఠశాలలో ముందస్తు దీపావళి వేడుకలు కీర్తి సురేష్, రాధిక ఆప్టే ప్రధాన పాత్రల్లో నెట్‌ఫ్లిక్స్ 'అక్క' వెబ్ సిరీస్: మాతృస్వామ్య నేపథ్యంలో గ్యాంగ్‌స్టర్ డ్రామా బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వచ్చునూరు గ్రామ మాజీ సర్పంచ్ పారమిత విద్యాసంస్థలలో ఘనంగా ముందస్తు దీపావళి వేడుకలు వ్యూహం ఫలించింది...ఆశించిన ఎంపీపీ పీఠం దక్కింది! పాలమూరు ఎడారిగా మారడానికి కేసీఆరే కారణం సుస్థిర జీవనశైలి వారోత్సవాలు ముగింపు సందర్భంగా ర్యాలీ నేరేడుచర్లలో బియ్యం ధరల బాదుడు! కరువు కష్టాలకు తోడు వ్యాపారుల ధరల మోత.. సామాన్యుడి బతుకు భారమే! కిలో బియ్యం రూ.80 నుంచి రూ.90 వరకు విక్రయాలు అధికారుల హెచ్చరికలు ప్రకటనలకేనా? క్షేత్రస్థాయిలో తనిఖీలేవీ అచీవర్స్ పాఠశాలలో ఘనంగా కాలుష్య రహిత దీపావళి వేడుకలు వికసిత్ భారత్ @ 2047లో  యువ సంవాద్ . గాజువాకలో వ్యక్తి అనుమానాస్పద మృతి జాతీయ స్థాయి రగ్బీ పోటీల్లో సత్తా చాటిన శ్రీ చైతన్య విద్యార్థిని సాహితి నిర్లక్యం వద్దు....జాగర్తలు పాటిస్తూ దీపావళి జరుపుకోవాలి - హెచ్ ఎం డాక్టర్ జె సి రాజు

మడావి రాజేశ్వర్‌కు సెక్రటరీ అవార్డు ప్రదానం

Select Suryaa Now
మడావి రాజేశ్వర్‌కు సెక్రటరీ అవార్డు ప్రదానం
సూర్య జైనూర్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం రాసిమెట్ట గ్రామానికి చెందిన ఆర్ట్ డైరెక్టర్, గిరిజన పరిశోధకుడు మడావి రాజేశ్వర్‌కు సెక్రటరీ అవార్డు లభించింది. తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ ఆధ్వర్యంలో సాద్నగర్‌లోని టీజీటీడబ్ల్యూఆర్‌డీసీ డబ్ల్యూ లో నిర్వహించిన నాలుగు రోజుల పెయింటింగ్ వర్క్‌షాప్‌ ‘చిత్రధార’ కార్యక్రమంలో భాగంగా గిరిజన ప్రాంతీయ కళలు, గుస్సాడి సంప్రదాయాలు, గోండు చిత్రకళపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథి కె. సీతా లక్ష్మి, ఐఏఎస్ చేతుల మీదుగా మడావి రాజేశ్వర్ సెక్రటరీ అవార్డును అందుకున్నారు. అవార్డుతో పాటు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాజేశ్వర్ మాట్లాడుతూ తరతరాలుగా వస్తున్న ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే గోండు చిత్రకళను ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని కోరారు. సహజ రంగులతో చిత్రకళను అభివృద్ధి చేయాలని, గోండు చిత్రకళకు అంతర్జాతీయ స్థాయిలో విశేష గుర్తింపు, ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డా. కె. వేణుగోపాల్, డిప్యూటీ సెక్రటరీ ఏ సి ఏ డి, డా. నీరజ, డా. సతీష్ గౌడ్, డా. ఎ. నీతా, టీజీటీడబ్ల్యూఆర్‌డీసీ డబ్ల్యూ ప్రిన్సిపల్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర గిరిజన గురుకుల విద్యాసంస్థల విద్యార్థులు పాల్గొన్నారు.