BREAKING
నాలాల పునరుద్ధరణకై మున్సిపల్ ముట్టడిని విజయవంతం చేద్దాం..సోమిశెట్టి దశరథం పవన్ కళ్యాణ్‌తో మరో సినిమాపై దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ ప్రొడ్యూసర్! ఎండపల్లి పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో పత్తికి 8810 ధర అక్షర స్కూల్లో ముందస్తుగా బాలల దినోత్సవ వేడుకలు ప్రారంభోత్సవానికి సిద్ధంగా పబ్లిక్ టాయిలెట్లు ఎర్రావారిపాలెం మండలంలో టీడీపీకి షాక్‌..! తూప్రాన్ గీత స్కూల్లో చాచాజీ ఆకారంలో విద్యార్థులు ఎండపల్లి రహదారుల అభివృద్ధికి రూ.55 లక్షలు మంజూరు చేయాలి రబీ సాగులో నీటి లభ్యతకు అనుగుణంగా పంటల ప్రణాళిక రూపొందించాలి ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటం *గనుగాపూర్ పుణ్యక్షేత్రానికి మహా పాదయాత్ర ప్రారంభం భక్తులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే* *రైతులకు వ్యవసాయ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలి* భారత్ సమ్మిట్ లో పాల్గొన్న సుడా మాజీ చైర్మన్

కోదాడ నియోజకవర్గంలో విద్యుత్ సమస్య లేకుండా చర్యలు. ఎమ్మెల్యే పద్మావతి ఉత్తం రెడ్డి.

Select Suryaa Now
కోదాడ నియోజకవర్గంలో విద్యుత్ సమస్య లేకుండా చర్యలు.  ఎమ్మెల్యే పద్మావతి ఉత్తం రెడ్డి.

 


కూచిపూడిలో 2.80 కోట్ల వ్యయంతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ ప్రారంభించిన ఎమ్మెల్యే.


కోదాడ (మేజర్ న్యూస్) కోదాడ నియోజకవర్గం లో విద్యుత్ సమస్య లేకుండా చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని అందుకు అవసరమున్న చోట
నూతన విద్యుత్ సబ్‌స్టేషన్ లు ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ రెడ్డి తెలిపారు. గురువారం కోదాడ మండలం కూచిపూడి గ్రామంలో 2 కోట్ల 80 లక్షలతో నిర్మించిన 33 11 కేవీ విద్యుత్తు సబ్స్టేషన్ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన స్టేషన్ అందుబాటులోకి రావడంతో కూచిపూడి, కాపుగల్లు, యతిరాజాపురం తండా పరిధిలోని ప్రజలకు మెరుగైన విద్యుత్ సరఫరా అందుతుందని తెలిపారు. ముఖ్యంగా చాలాకాలంగా ఎదురవుతున్న లో ఓల్టేజ్ సమస్యకు పరిష్కారం లభించడంతో పాటు గృహ, వ్యవసాయ విద్యుత్ అవసరాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.
ఈ సబ్‌స్టేషన్ పరిధిలో మొత్తం 1,140 గృహ విద్యుత్ కనెక్షన్లు, 1,184 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయని తెలిపారు. రైతులకు సాగు అవసరాలకు, ప్రజలకు గృహ అవసరాలకు నిరంతరాయంగా మెరుగైన విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని వివరించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి తోపాటు మండల పార్టీ నాయకులు మందలపు శేషు, కాపుగల్లు సింగల్ విండో చైర్మన్ నంబూరి సూర్యం, తుమాటి నాగిరెడ్డివిద్యుత్ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

మహిళా శక్తి సంఘ భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే._________________________
కోదాడ మండలం కూచిపూడి తండాలో 10 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ మహిళా సంఘం భవనాన్ని కోదాడ ఎమ్మెల్యే శ్రీమతి నలమాద పద్మావతి రెడ్డి  ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళా సంఘాలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తోందని తెలిపారు. మహిళా సంఘాల సమావేశాలు, స్వయం ఉపాధి కార్యక్రమాలు, వివిధ అభివృద్ధి కార్యకలాపాలకు ఈ భవనం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించి అన్ని రంగాల్లో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.