BREAKING
అయ్యప్ప అన్నసమారాధనలో పాల్గొన్న స్వాతి ప్రమోటర్స్ ఎండి రమేష్ రెడ్డి నేరడిగొండ కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఘనంగా స్కౌట్స్ అండ్ గైడ్స్ దినోత్సవం సిద్దిపేట డిపో మేనేజర్‌పై చర్యలు తీసుకోవాలి - టీఎంయూ రాష్ట్ర నాయకుల డిమాండ్ ఆళ్లగడ్డ మండలంలో కూటమి ప్రభంజనం ఐవీవై పాఠశాలలో ముందస్తు దీపావళి వేడుకలు కీర్తి సురేష్, రాధిక ఆప్టే ప్రధాన పాత్రల్లో నెట్‌ఫ్లిక్స్ 'అక్క' వెబ్ సిరీస్: మాతృస్వామ్య నేపథ్యంలో గ్యాంగ్‌స్టర్ డ్రామా బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వచ్చునూరు గ్రామ మాజీ సర్పంచ్ పారమిత విద్యాసంస్థలలో ఘనంగా ముందస్తు దీపావళి వేడుకలు వ్యూహం ఫలించింది...ఆశించిన ఎంపీపీ పీఠం దక్కింది! పాలమూరు ఎడారిగా మారడానికి కేసీఆరే కారణం సుస్థిర జీవనశైలి వారోత్సవాలు ముగింపు సందర్భంగా ర్యాలీ నేరేడుచర్లలో బియ్యం ధరల బాదుడు! కరువు కష్టాలకు తోడు వ్యాపారుల ధరల మోత.. సామాన్యుడి బతుకు భారమే! కిలో బియ్యం రూ.80 నుంచి రూ.90 వరకు విక్రయాలు అధికారుల హెచ్చరికలు ప్రకటనలకేనా? క్షేత్రస్థాయిలో తనిఖీలేవీ అచీవర్స్ పాఠశాలలో ఘనంగా కాలుష్య రహిత దీపావళి వేడుకలు వికసిత్ భారత్ @ 2047లో  యువ సంవాద్ . గాజువాకలో వ్యక్తి అనుమానాస్పద మృతి

కంజర్ గ్రామస్తుల భూముల సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.

Select Suryaa Now
కంజర్ గ్రామస్తుల భూముల సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.
సూర్య నిర్మల్ జిల్లా ప్రతినిధి. : లక్ష్మణచందా మండలం కంజర్ గ్రామ భూముల సమస్యలు త్వరితగతిన పరిష్కరించేందుకు చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.శనివారం జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, కంజర్ గ్రామస్తుల భూముల సమస్యల పరిష్కార విషయంపై లక్ష్మణచందా తహసీల్దార్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన భూ సమస్యల దరఖాస్తుల సంఖ్య, సమస్యల పరిష్కారానికి చేపట్టిన చర్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలన్నారు. ప్రతి దరఖాస్తుకు సంబంధించి వివరాలు క్లుప్తంగా నమోదు చేయాలన్నారు. దరఖాస్తుల వివరాలన్నీ పకడ్బందీగా నమోదు చేయాలని చెప్పారు. 
- మండల స్థాయి ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉండాలి. : మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణికి వచ్చే దరఖాస్తులన్నీ ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉండాలని అధికారులను ఆదేశించారు. ఆయా శాఖల అధికారులు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలన్నారు.  అవసరమైతే దరఖాస్తులను పై స్థాయికి పంపాలని తెలిపారు. మండలంలో భూముల రీ సర్వే ప్రక్రియను సమీక్షించారు. భూముల రీ సర్వే వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు.  ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ వెంకట మాధవ రావు, ఆర్డీవో దేవీదాస్, తహసీల్దార్ సరిత, ఎంపిడివో వనజ, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.