కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ ఆశాలు* *మూడేళ్లు గడిచినా ఇచ్చిన హామీలు అమలు కాలేదంటూ ఆవేదన
*మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి వినతిపత్రం అందజేసిన ఆశా కార్యకర్తలు*
*సూర్యాపేట టౌన్ మేజర్ న్యూస్*
సూర్యాపేట: అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలతో పాటు ఆశా కార్యకర్తలను నిలువునా మోసం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆశా కార్యకర్తలు మండిపడ్డారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 15 నుంచి నిర్వహించనున్న నిరవధిక సమ్మె సందర్భంగా గురువారం మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డికి స్థానిక క్యాంపు కార్యాలయంలో సమ్మె నోటీసు, వినతిపత్రం అందజేసి మాట్లాడారు. ఆశా కార్యకర్తలు మూడేళ్ళుగా ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ కంటికి రెప్పలా కాపాడుకుంటే రేవంత్ రెడ్డి మాత్రం ఆశాల చావు కోరుతున్నాడన్నారు. జీతాలు సక్కగా ఇవ్వడం చేతకాదు కానీ ప్రమాదభీమా మాకెందుకన్నారు. ఆశా వర్కర్లకు ఇనర్సురెన్స్ 50లక్షలు, మట్టి ఖర్చులు రూ 50వేలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ 5 లక్షలు, రిటైర్మెంట్ తరువాత వేతనంలో 50శాతం పెన్షన్, ప్రతి ఆదివారం, పండుగ రోజులకు సెలవులు, సంవత్సరంలో 20రోజులు క్యాజువల్ లీవ్, 6నెలలు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, ఎఎన్ఎం జీఎన్ఎం ట్రైనింగ్ చేసిన ఆశాలకు పదోన్నతి, రెండో, పీఆర్సీలో ఆశా వర్కర్లకు కనీస వేతనం 30వేలు కేటాయించి ప్రభుత్వం ప్రకటించిన రెండు డీఏలను ఆశాలకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బేషరతుగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని ఈ నెల 15 నుంచి నిరవధిరక సమ్మె నిర్వహిస్తున్నామని హామీలు అమలయ్యే వరకు సమ్మె విరమించేది లేదన్నారు. సమ్మెకు మద్దతిచ్చి ఆశాలకు అండగా నిలువాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని కోరారు. ఆశా వర్కర్ల వినతికి సానుకూలంగా స్పందించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆశా వర్కర్లవి న్యాయమైన సమస్యలని కనీస వేతనంతో పాటు ఇతర సమస్యలపై ప్రశ్నించి అమలుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్, డీఎంహెచ్ కు సమ్మె నోటీసులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ టి యు జిల్లా అధ్యక్షులు వెంపటి గురూజీ, హుజూర్ నగర్ నియోజకవర్గ అధ్యక్షులు పచ్చిపాల ఉపేందర్, బిఆర్టియు జిల్లా కన్వీనర్ మేకల జయమ్మ, ఎఐటియుసి జిల్లా అధ్యక్షురాలు నకిరెకంటి కవిత, సీత, విజయ, అరుణ, విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.