కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ వర్ధంతి
కడ్తాల్ రంగారెడ్డి
కడ్తాల్ మండల కేంద్రంలో ని ప్రధాన కూడలిలో మాజీ ప్రధాన మంత్రి భారతరత్న ఇందిరాగాంధీ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఇంద్ర గాంధీ చిత్రపటానికి పూల మాల వేసి పూలతో నివాళులు అర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టిపిసిసి సభ్యులు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ దేశ ఐక్యత సమగ్రత పేదల అభ్యున్నతికి కోసం ఇందిరాగాంధీ చేసిన కృషి చిరస్మరణీయమని బంగ్లాదేశ్ విముక్తికి వంటి చారిత్రాత్మక నిర్ణయాలతో దేశాన్ని అగ్రగామిగా నిలిచారని కొనియాడారు ఆమె ఆశయాలనుకాంగ్రెస్ శ్రేణులు కొనసాగించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ మార్కెట్ వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి నాయకులు నరసింహ చేగురి వెంకటేష్ లక్ష్మయ్య కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు