BREAKING
కోల్ ఇండియా స్థాయి క్రీడా పోటీలను ఘనంగా నిర్వహించాలి బంగారం కోసం వృద్ధురాలి హత్య కేసు... -- ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా మంత్రి శ్రీధర్ బాబు సర్పంచ్ అభ్యర్థులతో పోలీసుల ఎన్నికల అవగాహన సమావేశం ఇంటింటికీ మెరుగైన వైద్యం అందేలా పనిచేయాలి గొట్టిపల్లి సర్పంచ్‌గా అవ్వ తేజేశ్వరి ఏకగ్రీవ ఎన్నిక.. గత ప్రభుత్వ హయాంలోనే హుజురాబాద్ అభివృద్ధి -- ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పూర్ణిమకు మద్దతుగా మహిళల భారీ ర్యాలీ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు కోటబొమ్మాళి విద్యార్థిని ఎంపిక ఆర్థిక సహాయం...... మేజర్ పంచాయతీ పోరు రసవత్తరం.. భూ వివాదాలకు తావులేని గ్రామాలే లక్ష్యం. తెలంగాణ ఉద్యమ చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను తిప్పికొట్టాలి 14-15 ఏళ్ల బాలికలకు ఉచిత హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహణ గిజబ సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన మరడాన ఉషారాణి

జాతీయ టేబుల్ టెన్నిస్‌లో పోలీసు అధికారులకు రజత పతకం

Select Suryaa Now
జాతీయ టేబుల్ టెన్నిస్‌లో పోలీసు అధికారులకు రజత పతకం

సూర్య కరీంనగర్:
గుజరాత్ రాష్ట్రంలో నిర్వహించిన ఆల్ ఇండియా ఎన్జీఓ టేబుల్ టెన్నిస్ జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణ పోలీస్ శాఖకు చెందిన హుజూరాబాద్ ఏసీపీ వి. మాధవి, సీఐడీ విభాగం మహిళా అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ కె. పద్మ రజత పతకం సాధించారు. మహిళల డబుల్స్ 50 ప్లస్ విభాగంలో వీరిద్దరూ అద్భుత ప్రతిభ కనబరిచి రెండో స్థానం దక్కించుకున్నారు. జాతీయ స్థాయిలో పతకం సాధించిన వీరిని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తన కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించి, మెడలో పతకాలు వేసి సత్కరించారు. పోలీస్ విధులు నిర్వర్తిస్తూనే క్రీడల్లో జాతీయ స్థాయిలో రాణించడం ఇతర సిబ్బందికి స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా సీపీ కొనియాడారు. తమ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన సీపీతో పాటు ఉన్నతాధికారులకు మాధవి, పద్మ కృతజ్ఞతలు తెలిపారు.