telangana
జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన శ్రీ చైతన్య డిఫెన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ విద్యార్థులు
సూర్య కరీంనగర్ : శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలోని శ్రీ చైతన్య డిఫెన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ విద్యార్థులు క్రీడారంగంలో ప్రతిభ చాటుతూ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.SGF అండర్-19 తైక్వాండో విభాగంలో వాసరి హారిక, కల్వ రోషిణి ఎంపిక కాగా, కబడ్డీ విభాగంలో ఎర్రవెల్లి అభినయశ్రీ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. విద్యార్థులు సాధించిన ఈ విజయాలు సంస్థకు గర్వకారణంగా నిలిచాయి.ఈ సందర్భంగా శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి విద్యార్థులను అభినందించి, ఘనంగా సత్కరించారు. క్రీడలతో పాటు విద్యార్థులు విద్యా, క్రీడా రంగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధనతో మరిన్ని విజయాలు సాధించి సంస్థకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ప్రోత్సహించారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కర్ర నరేందర్ రెడ్డి, సెక్రటరీ ముద్దసాని సాయి చైతన్య రెడ్డి, శ్రీ చైతన్య జూనియర్ కళాశాలల డీన్ జగన్ మోహన్ రెడ్డి, డిఫెన్స్ కళాశాల ప్రిన్సిపాల్ పల్లె శ్యామ్ సుందర్ రెడ్డి, ఫిజికల్ అడ్వైజర్ లెంకల మహిపాల్ రెడ్డి, ఏజీఎం శ్రీనివాస్, బోధన,బోధనేతర సిబ్బంది పాల్గొని విద్యార్థులను అభినందించారు.