telangana
జాతీయ సివిల్ సర్వీసెస్ చెస్ టోర్నీకి ఎంపికైన డా. పూర్ణచంద్రరావుకు సన్మానం
జాతీయ సివిల్ సర్వీసెస్ చెస్ టోర్నీకి ఎంపికైన డా. పూర్ణచంద్రరావుకు సన్మానం
లక్ష్మీదేవిపల్లి, సూర్య(మేజర్ న్యూస్)- మండల కేంద్రంలోని శ్రీ రామచంద్ర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల (అటానమస్)కు చెందిన డా. ఎం. పూర్ణచంద్రరావు జాతీయ సివిల్ సర్వీసెస్ చెస్ టోర్నమెంట్-2026కు ఎంపిక కావడం కళాశాలకు గర్వకారణంగా నిలిచింది. ఈనెల 8న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన జాతీయ స్థాయి టోర్నీలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా కళాశాలలో అధ్యాపక బృందం ఆధ్వర్యంలో డా. పూర్ణచంద్రరావును శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. విద్యతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ చాటడం అభినందనీయమని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.