telangana
ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం
సూర్య కోరుట్ల ;;;కోరుట్ల చిన్నమెట్పల్లి గ్రామంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ జువ్వాడి కృష్ణారావు ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ నిర్వహణలో ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మహమ్మద్ రహీం మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ బీమా పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరూ లబ్ధి పొందాలని, గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మహమ్మద్ రహీం, ఉప సర్పంచ్ వెలుమల మంజుల ఏకంబర్, వార్డు సభ్యులు, గ్రామపంచాయతీ సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పథకం లబ్ధిదారులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.