ఇల్లెందు లోరాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన- పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
సూర్య*ఇల్లెందు:* రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి 9గంటల వరకు ఇల్లెందు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. మహబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
తొలుత ఇల్లెందు జే కే కాలనీలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గోవింద్ సెంటర్లో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు.
*ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి.. ఆడబిడ్డలకు నూతన వస్త్రాలను అందజేసి*
తిలక్ నగర్ లో ఇందిరమ్మ ఇళ్లను మంత్రి పొంగులేటి ప్రారంభించారు. స్వయంగా.. ఒక్కో ఇంటి వద్దకు వెళ్లి ప్రారంభించి, లబ్ధిదారులతో మాట్లాడి వివరాలు తెలుసుకొని ఆనందం వ్యక్తం చేశారు. ఆడబిడ్డలకు నూతన వస్త్రాలను అందజేయగా.. వారంతా సంతోషం వ్యక్తం చేశారు. ఆ తర్వాత మేడికుంట వద్ద నూతనంగా నిర్మించిన హై లెవెల్ బ్రిడ్జిని ప్రారంభించారు.
*ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ..:* అన్ని ప్రాంతాల అభివృద్దే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. గిరిజన, ఆదివాసీ నియోజకవర్గమైన ఇల్లందులో మౌలిక సదుపాయాల కల్పనకు అనేక నిధులు కేటాయించానని, భవిష్యత్తులోనూ ప్రాధాన్యం ఇస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్ పసుపులేటి సత్యన్నారాయణ