హోటల్ హైదరాబాద్ బావర్చి ని ప్రారంభించిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి…
రుచి,శుచితో కస్టమర్ల. మనసును గెలవాలి…
ఫరూక్నగర్ రంగారెడ్డి:
షాద్‌నగర్ పట్టణంలోని జడ్చర్ల రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన హైదరాబాద్ భవార్చి హోటల్ ని ప్రారంభించిన పాలమూరు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి ఆదివారం హోటల్ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నిర్వాహకులతో కలిసి రిబ్బన్ కట్ చేసి హోటల్ ని ప్రారంభించారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణ ప్రజల అభిరుచులకు తగ్గట్టుగా ఆహ్లాదకరమైన వాతావరణంలో హోటల్‌ను తీర్చిదిద్దడం అభినందనీయమని, ప్రజలకు నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించి వారి మన్ననలు పొందాలని యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వాణి పాండురంగారెడ్డి, మాజీ కౌన్సిలర్ చిన్న యాదగిరి, యువ నాయకులు సుధీర్ తదితరులు పాల్గొన్నారు.
నరసింహారెడ్డి మేజర్ న్యూస్…