BREAKING
ఉత్కంఠ భరితంగా ఇంటర్ పాలిటెక్నిక్ క్రీడలు -బాలికల వాలీబాల్‌లో పలమనేరు చాంపియన్ -రెండో రోజూ హోరాహోరీ తలపడ్డ క్రీడాకారులు అకాల వర్షాలతో అన్నదాతల ఆందోళన వైసిపి బలపరిచిన రంపచోడవరం సర్పంచ్ గా సంకురు బేబీ కుమారి అఖండ విజయం గ్రామ పంచాయతీ అభివృద్ధే ప్రధాన లక్ష్యం ఎమ్మెల్యే సత్యప్రభను మర్యాదపూర్వకంగా కలిసిన అన్నవరం ఈఓ లక్ష్మీ శివ జ్యోతి రాజ్యాంగాన్ని కాపాడుకుందాం శ్రీపతిరావు పేట లో ప్రచార నిర్వహిస్తున్న సర్పంచ్ అభ్యర్థి చెన్నయ్య రాజ్యాంగంపై యువతకు అవగాహన ఉండాలి ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో రాజ్యాంగ దినోత్సవం -పోటీల విజేతలకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేత అధికారులు ఎన్నికలకు సమాయత్తం కావాలి ప్రత్తిపాడులో బలపడుతున్న వైసీపీ శివలింగాల దర్శనం మహాపాతక నాశనం తిరుపతిలో వైసీపీకి భారీ షాక్.. 3 వేల మందితో టిడిపి లో చేరిన తిరుమల వైసిపి నేత ప్రవీణ్ రాయల్ రేపు ఉదయం 10 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం.. మన ఓటే.. మన భవిష్యత్తు! రాజ్యాంగ విలువలే విద్యార్థులకు మార్గదర్శకం -మహాత్మా గాంధీ మునిసిపల్ పాఠశాలలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

గురుకుల సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం

Select Suryaa Now
గురుకుల సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం

 

*పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచాలి*

*ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, బోధనేతర పోస్టులను వెంటనే భర్తీ చేయాలి: మట్టిపల్లి సైదులు*

*చివ్వెంల, మేజర్ న్యూస్.*

గురుకుల పాఠశాలల్లో చదువుతున్న పేద, బడుగు వర్గాల విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు డిమాండ్ చేశారు. సోమవారం చివ్వెంల మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలను సంఘం ఆధ్వర్యంలో సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా మెస్, కాస్మోటిక్ చార్జీలను పెంచకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం, అవసరమైన వస్తువులు అందించడంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అన్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం, పరిశుభ్రమైన వాతావరణం, మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
గురుకులాల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, బోధనేతర ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కోరారు. సిబ్బంది కొరతతో విద్యార్థుల విద్యాబోధన, పర్యవేక్షణకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టాలని అన్నారు.
గురుకుల విద్యార్థుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం కొనసాగితే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని మట్టిపల్లి సైదులు హెచ్చరించారు. ఆయన వెంట సీఐటీయూ మండల కన్వీనర్ ఇట్ట మల్ల స్టాలిన్ ఉన్నారు.