గ్రామపంచాయతీకి వైకుంఠ రథం బహుకరణ
సూర్య, హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం చెల్పూర్ గ్రామానికి శనివారం జయన్న ఫౌండేషన్ అధినేతలు గుడిపాటి సరిత, జయపాల్ రెడ్డి లు వైకుంఠ రథాన్ని బహుకరించారు. హుజురాబాద్ మండలంలో పెద్ద గ్రామపంచాయతీ ఆయన చెల్పూర్ గ్రామ ప్రజలకు సౌకర్యం కోసం ప్రజల కోరిక మేరకు వైకుంఠ రథాన్ని వారు బహుకరించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వంతడుపుల కస్తూరి మాట్లాడుతూ..... తమ గ్రామ ప్రజల సౌకర్యార్థం వైకుంఠ రథాన్ని బహుకరించిన జయన్న ఫౌండేషన్ అధినేతలు గుడిపాటి సరిత - జైపాల్ రెడ్డి ఔదార్యం గొప్పదని అన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజల బాగోగులను పరిష్కరిస్తూ, వారికి అన్ని రంగాల్లో సేవలను అందిస్తున్న జైపాల్ రెడ్డి దంపతులు ధన్య జీవులని అన్నారు. సేవే పరమార్ధంగా పనిచేస్తున్న వారిని ఇతరులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అనంతరం మాజీ ఎంపిటిసి గుడిపాటి సరిత మాట్లాడుతూ...పేద విద్యార్థులకు అండగా ఉంటామని అన్నారు. అనంతరం జయన్న ఫౌండేషన్ అధినేత గుడిపాటి జయపాల్ రెడ్డి మాట్లాడుతూ.... గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులను ఏర్పాటు చేయడానికి తమ ఫౌండేషన్ కృషి చేస్తుందన్నారు. మంచినీటి సౌకర్యం శస్త్ర చికిత్సలు చేయించడంతోపాటు చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు ప్రోత్సహించడానికి అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నేరేళ్ల శ్రీనివాస్, వార్డు సభ్యు లు, మాజీ సర్పంచ్ పోలంపల్లి శ్రీనివాస్ రెడ్డి, అకినపల్లి శిరీష, సునీల్, పుల్ల రాధ తదితరులు పాల్గొన్నారు